• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్తి అగ‌ర్వాల్ త‌ర‌హాలో...

ఆర్తి అగ‌ర్వాల్ త‌ర‌హాలో మ‌రో న‌టి మృతి

| తెలుగు సినీవినీలాకాశంలో ధృవ‌తార‌గా వెలిగిపోయింది ఆర్తీ అగర్వాల్. టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఆర్తి అగ‌ర్వాల్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు

By - Tupaki Desk
Update: 2023-11-10 16:46 GMT

తెలుగు సినీవినీలాకాశంలో ధృవ‌తార‌గా వెలిగిపోయింది ఆర్తీ అగర్వాల్. టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఆర్తి అగ‌ర్వాల్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. ప్ర‌తిభావ‌ని ఆర్తి అనూహ్యంగా అంత‌ర్థాన‌మైంది. ఆర్తి అగ‌ర్వాల్ కెరీర్ జ‌ర్నీ, ల‌వ్ లైఫ్, ఆక‌స్మిక మ‌ర‌ణం ఇవ‌న్నీ అభిమానుల్లో ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశం. 5 మార్చి 1984న న్యూజెర్సీలో గుజరాతీ తల్లిదండ్రులకు 1 జన్మించిన ఆర్తి 6 జూన్ 2015న అట్లాంటిక్ సిటీ, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్‌లో మరణించింది. మ‌ర‌ణించేప్ప‌టికి ఆర్తి వ‌య‌సు 31. ఆర్తి మేనేజర్ వివ‌రాల‌ ప్రకారం.. ఆర్తి ఊబకాయం - ఊపిరితిత్తుల అనారోగ్యంతో పోరాడింది. ఆమె మరణానికి ఆరు వారాల ముందు లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. మరణానికి ముందు తీవ్రమైన శ్వాస సమస్యలు ఉన్నాయి. చివ‌రికి కార్డియాక్ అరెస్ట్ (గుండెనొప్పి)తో మ‌ర‌ణించిందని మేనేజర్ తెలిపారు.

ఇప్పుడు ఇంచుమించు అలాంటి స‌మ‌స్య‌తోనే 29 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్ కం న‌టి మ‌ర‌ణించ‌డం సంచ‌ల‌నమైంది. లైపో స‌క్ష‌న్ సర్జరీ విక‌టించి స‌ద‌రు మోడ‌ల్ గుండెపోటుతో మరణించింది. బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ - రియాలిటీ టీవీ స్టార్ లుయానా ఆండ్రేడ్ తన మోకాలి నుండి కొవ్వును తొలగించే ఆపరేషన్ కోసం ప్ర‌య‌త్నించింది. లుయానా ఆండ్రేడ్ సోమవారం సావో పాలోలోని హాస్పిటల్ సావో లూయిజ్‌కి వెళ్లి మోకాలి లైపోసక్షన్ ఆపరేషన్‌ని ఒక ప్రైవేట్ సర్జన్ - కుటుంబం నియమించిన అనస్థీషియాలజిస్ట్ చేత చేయించుకున్నారు. అయితే అప్ప‌టికే శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆమె శస్త్రచికిత్స జరిగిన రెండు గంటల తర్వాత గుండె పోటుతో మ‌ర‌ణించింది. సర్జన్లు ఆ ప్రక్రియను అకస్మాత్తుగా నిలిపివేశారు. ఆమె భారీ థ్రోంబోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆమెను ఐసీయూకి తరలించినప్పటికీ మంగళవారం ఉదయం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఈ మరణానికి కారణం పల్మోనరీ ఎంబోలిజం, ఆకస్మిక ధమనుల అడ్డంకిగా గుర్తించిన‌ట్టు తెలిసింది. స‌ద‌రు న‌టీమ‌ణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.6ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అభిమానులు ఆమె కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు. ఇలాంటి మ‌ర‌ణం త‌గ‌దంటూ మోడ‌ల్స్, న‌టీమ‌ణుల‌కు అభిమానులు సూచిస్తున్నారు.

Tags:    
  • Brazilianinfluencer 
  • Luanaandrade 
  • Cardiacarrest 
  • Liposuctionsurgery 
  • Luanaandradedeath 
  • Actressluana 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS