'లవ్ మీ' సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ ఎంతంటే?

రౌడీ బాయ్స్ సినిమా తర్వాత నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ నటిస్తున్న సినిమా లవ్ మీ.

Update: 2024-05-23 06:20 GMT

రౌడీ బాయ్స్ సినిమా తర్వాత నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ నటిస్తున్న సినిమా లవ్ మీ. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ లవ్ మీ సినిమా.. ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ ఓ వైపు ప్రమోషన్స్ చేస్తున్నా.. మళ్లీ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఎందుకంటే రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో ఫస్ట్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదని, సెన్సార్ కూడా పూర్తవ్వలేదని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నిటికీ తెరదించారు లవ్ మీ మేకర్స్.

ఈ సినిమా సెన్సార్ పనులు తాజాగా పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2 గంటల 16 నిమిషాల (136 నిమిషాలు) రన్ టైమ్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దెయ్యంతో లవ్, రొమాన్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. మూవీ ట్రైలర్ కూడా కొంత ఆసక్తి రేపింది.

ఎవరైనా చేయొద్దని చెప్పిన పనినే కావాలని చేసే హీరో (ఆశిష్).. వద్దని చెప్పినా వినకుండా దెయ్యం ఉండే ఓ భవనానికి వెళ్తాడు. అక్కడికి వచ్చిన వారిని ఎందరినో చంపేసిన దెయ్యాన్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఎలాగైనా ఆ దెయ్యాన్ని చూడాలని ప్రయత్నిస్తాడు. ఓ రోజు రాత్రి ఎనిమిది గంటలకు సైరన్ మోగుతుంది. ఆ సమయంలో ఓ అమ్మాయి తన తలుపు తెరిచి చూసి భయంతో గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది పూర్తి సినిమాగా తెలుస్తోంది.

Read more!

ఇక ఈ సినిమాలో వైష్ణవి చైతన్యతో పాటు యంగ్ హీరోయిన్ సిమ్రన్ చౌదరి కూడా లీడ్ రోల్ పోషించినట్లు టాక్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ సీజన్ 4 గేమ్‍ షోలో ఆశిష్, వైష్ణవి చైతన్యతో పాటు సిమ్రన్ కూడా పాల్గొంది. దీంతో ఆమె కూడా నటించినట్లు తెలుస్తోంది. ఇక హీరో ఆశిష్.. ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు యాక్ట్ చేసినట్లు చెప్పారు. మరి వారెవరో మే 25న ఈ సినిమా రిలీజ్ రోజు తేలిపోనుంది.

Tags:    

Similar News