• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భ‌ర్త నుంచి విడిపోతున్న...

భ‌ర్త నుంచి విడిపోతున్న ప్ర‌ముఖ గాయ‌ని

| న‌టుడు బెన్ అఫ్లెక్ ని పెళ్లాడిన జెలో విడాకులు తీసుకోబోతున్నార‌నేది కొంత‌కాలంగా మీడియాలో చ‌ర్చ‌.

By - Tupaki Desk
Update: 2024-08-02 23:30 GMT

పాపుల‌ర్ గాయ‌ని భ‌ర్త నుంచి విడిపోతోంది. కోర్టు ప‌త్రాల‌న్నీ రెడీగా ఉన్నాయి.. స‌రైన స‌మ‌యం వ‌స్తే అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే మిగిలి ఉంది. ఇది అభిమానుల‌కు విచార‌క‌ర‌మైన వార్తే అయినా.. విన‌కుండా ఉండ‌లేరు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో పాపుల‌ర్ గాయ‌ని ఎవ‌రు? అంటే.. ది గ్రేట్ జెన్నిఫ‌ర్ లోపేజ్. అమెరిక‌న్ పాప్ గాయ‌ని.. డ్యాన్స‌ర్.. బిజినెస్ ఉమెన్. జెలోగా సుప్ర‌సిద్ధురాలు. న‌టుడు బెన్ అఫ్లెక్ ని పెళ్లాడిన జెలో విడాకులు తీసుకోబోతున్నార‌నేది కొంత‌కాలంగా మీడియాలో చ‌ర్చ‌.


పెళ్లయిన‌ రెండేళ్లకు బెన్ అఫ్లెక్ - జెన్నిఫర్ లోపెజ్ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు. కాగితాలను ఖరారు అయ్యాయి. కానీ ఇంకా వాటిని కోర్టులో దాఖలు చేయలేదు. జెన్నిఫ‌ర్ లోపెజ్ సయోధ్య కోసం ఆశించినప్పటికీ వారు వేసవిలో విడి విడిగానే గడిపారు. ఇప్ప‌టికి ఈ జంట తమ నిర్ణయం గురించి సంయుక్త ప్రకటన విడుదల చేయాలని యోచిస్తున్నారు. డైలీ మెయిల్‌లోని ఒక క‌థ‌నం ప్రకారం.. ఈ జంట తమ విడాకుల పత్రాలను `ఫైనలైజ్` చేశారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. అయితే వాటిని అధికారికంగా కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. ఈ జంట‌ నెల క్రితమే విడాకుల పత్రాలను ఖరారు చేశారు.. కానీ దానిని ప్రకటించడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారు`` అని ఈ జంటకు సన్నిహితంగా ఉండే ఒక సోర్స్ చెబుతోంది.

ఇద్దరూ ఉమ్మడి ప్రకటనను విడుదల చేస్తారని, పెళ్లిని ఫలవంతం చేయడానికి తమ ప్రయత్నాలను అభిమానులకు షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ చివరికి వారు రాజీకి రాలేకపోయారు. వారి న‌డుమ ఇంతకు ముందు ఉన్న‌ అనుబంధం ఇప్పుడు లేదు. అది పోయింద‌ని వారిద్దరూ అంగీకరించారు అని తెలుస్తోంది. అయితే జెలో ఎప్ప‌టికీ వారి సంబంధాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదని మరొక సోర్స్ చెబుతోంది. జెలో వైపు నుండి ఇంకా చాలా ప్రేమ ఉంది.. కాబట్టి ఆశ ఉండాలి! అని ఒక సోర్స్ చెబుతోంది.

ఇటీవ‌ల విఫలమైన సయోధ్య ప్రయత్నాల న‌డుమ జెన్నిఫ‌ర్ లోపెజ్ ఒక పిజ్జా స్పాట్‌లో గంభీరంగా కనిపించింది. ఆమె పుట్టినరోజు సంద‌ర్భంగా విహారయాత్ర జరిగింది. ఆ సమయంలో లోపెజ్ 55 వ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జరుపుకుంది. జూలై 24న పసిఫిక్ పాలిసాడ్స్‌లో 20.5 మిలియన్ల డాల‌ర్లు ఖ‌రీదైన‌ భవనాన్ని బెన్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కొత్త ఇంట్లో ఐదు బెడ్‌రూమ్‌లు, ఆరు బాత్‌రూమ్‌లు, బహుళ నివాస స్థలాలు, అతిథి గృహం ఉన్నాయి.

ఇంత‌లోనే ఈ జంట తమ బెవర్లీ హిల్స్ భవనాన్ని 68 మిలియన్ల డాల‌ర్ల‌కు అమ్మేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. బెన్ అఫ్లెక్ తన మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ బ్రెంట్‌వుడ్ ఇంటికి సమీపంలో ఉన్న 100,000 మిలియ‌న్ల‌ అద్దె ప్యాడ్‌లోకి మారాడని వార్త‌లొచ్చాయి. అత‌డి మాజీ భార్య‌ ముగ్గురు పిల్లలైన వైలెట్ (18), ఫిన్ (15), శామ్యూల్ (12)తో కలిసి నివాసం ఉంటున్నట్లు గ‌తంలో పుకార్లు వ‌చ్చాయి.

బెన్ అఫ్లెక్ - లోపెజ్ చివరిసారిగా మార్చి 30న కలిసి కనిపించారు. ఆ త‌ర్వాత‌ వేసవిని విడిగా గడిపారు. జెలో ఎక్కువగా తూర్పు తీరంలో.. అఫ్లెక్ లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. వారు తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని క‌లిసి జ‌రుపుకోలేదు. మైళ్ల దూరంలోని వేర్వేరు నగరాల్లో గడిపారు. ఈ జంట 16 జూలై 2022న లాస్ వెగాస్‌లోని ఎ లిటిల్ వైట్ వెడ్డింగ్ చాపెల్‌లో వివాహం చేసుకున్నారు. తరువాతి నెలలో జార్జియాలో విలాసవంతమైన వేడుకను జరుపుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పెళ్లి బ్రేక్ అవుతోంది.

Tags:    
  • Hollywood 
  • Americanpopsinger 
  • Jenniferlopez 
  • BenAffleck 
  • Relationship 
  • Divorce 
  • Court 
  • PacificPalisades 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS