• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోకేష్ కనగరాజ్.. ఏదో...

లోకేష్ కనగరాజ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు

| మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ

By - Tupaki Desk
Update: 2023-09-30 11:07 GMT

మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ. ఖైది, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న లోకేష్ ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో లియో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమా నుంచి వస్తోన్న సాంగ్స్ కొంత వరకు రీచ్ ఉన్న మరీ హైలెవల్ లో బజ్ క్రియేట్ చేయడం లేదు.

ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కనుంది. నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యి ఉంది. అలాగే విక్రమ్, ఖైది సీక్వెల్స్ కూడా లోకేష్ కనగరాజ్ లైన్ అప్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ లోకేష్ గురించి సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

బాలీవుడ్ నుంచి లోకేష్ కనగరాజ్ కి అఫర్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఒకటి చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారంట. అలాగే, తెలుగు, తమిళ్ స్టార్స్ తో కూడా కొన్ని సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయంట. వీటికి సంబంధించిన డిటైల్స్ త్వరలో బయటకొచ్చే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత బాలీవుడ్ లో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లేదంటే తెలుగులో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. బడా నిర్మాతలు కూడా లోకేష్ కనగరాజ్ సినిమా చేస్తా అంటే అడ్వాన్స్ లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక లియో చిత్రంపైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పటికే సినిమా బిజినెస్ జరిగిపోయింది.

కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని లియో చిత్రంతో సాధించాలని విజయ్, లోకేష్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. త్రిష, ప్రియా ఆనంద్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు.

Tags:    
  • Leomovie 
  • Vijaythalapthy 
  • Lokeshkanagaraj 
  • Rajinikanth 
  • Prabhas 
  • Bollywoodindustry 
  • Multistarrermovie 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS