సూపర్ స్టార్ ఒకే చెప్పినా డైరెక్టర్ నో అనేసాడు!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ `కూలీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ `కూలీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసి ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారం కూడా నిర్వహించడం లేదు. కేవలం ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసి నేరుగా థియేటర్లోకి రాబోతున్నారు. కంటెంట్ పై లోకేష్ కు ఉన్న నమ్మకంతోనే ఇలా చేస్తున్నారు. ఓ రకంగా ఓపెనింగ్స్ పరంగా కాస్త రిస్క్ అయినా? లోకేష్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందు కొస్తున్నాడు.
సినిమాపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి 1000 కోట్లు వసూళ్లు తెచ్చే సినిమా ఇదే అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది అక్కడి పరిశ్రమ. తాజాగా ఈసినిమా ఎలా సెట్ అయింద న్నది లోకేష్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అసలు రజనీకాంత్ తో `కూలీ` ఆలోచనలే తనకు లేద న్నారు. ముందుగా రజనీకి కూలీ కథ కాకుండా మరో స్టోరీ వినిపించాడుట. అందులో రజనీకాంత్ పాత్ర విలన్ గా ఉంటుందిట. ఆ పాత్రలో నటించడానికి రజనీకంత్ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదుట.
పాత్ర నచ్చడంతో రెడీ అన్నారు. కానీ సినిమా నిర్మాణానికి మాత్రం చాలా సమయం పడులతుందని, కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుందన్నాడుట. అదొక ఫాంటసీ కథ కావడంతోనే అంత సమయం పడుతుందన్నాడు. దీంతో ఇప్పట్లో ఈ సినిమా చేయడం కష్టమవుతుందని మళ్లీ లోకేషే వద్దు మరో కథతో ముందుకెళ్తామని చెప్పాడుట. రెండేళ్ల పాటు రజనీ కాంత్ సమయాన్ని వృద్దా చేయకూడదు అన్న ఉద్దేశం తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
అదే సమయంలో తాను కూడా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నట్లు లోకేష్ రివీల్ చేసాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కూలీ కథ చెప్పడం రజనీకాంత్ కి నచ్చడంతో పట్టాలెక్కిందన్నాడు. `కూలీ` రిలీజ్ అనం తరం లోకేష్ ` ఖైదీ 2` పనుల్లో బిజీ అవుతాడు. ఇప్పటికే కార్తీ కూడా సిద్దంగా ఉన్నాడు. ఎల్ సీయూలో భాగంగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా `ఖైదీ 2` మొదలవుతుంది.