సందిగ్ధంలో లోకేష్ అడుగులు ఎటువైపు..?

కార్తి తో ఖైదీ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టాడని నిన్న మొన్నటిదాకా వార్తలు రాగా మళ్లీ సడెన్ గా లోకేష్ ఈ డెసిషన్ అతని ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.;

Update: 2025-10-22 15:30 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ ఒకరు. ఖైదీ, విక్రం సినిమాలతో అతను స్టార్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక స్పెషల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. లోకేష్ కనకరాజ్ రీసెంట్ రిలీజ్ కూలీ సినిమాపై కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. కానీ ఆ సినిమా ఫైనల్ రిజల్ట్ బిలో యావరేజ్ గా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ సినిమా అనేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. ఐతే వాటిని ఏమాత్రం అందుకోలేదు లోకేష్ కనకరాజ్.

రజినీ, కమల్ హాసన్ కాంబో సినిమా..

ఐతే కూలీ తర్వాత అసలైతే కార్తితో ఖైదీ 2, అమీర్ తో ఒక సూపర్ హీరో సినిమా చేయాల్సిన లోకేష్ ఆ రెండు సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. ఈమధ్య లోకేష్ రజినీ, కమల్ హాసన్ కాంబో సినిమా చేస్తాడన్న టాక్ రాగా అది కూడా నిజం కాదని తేలింది. ఐతే లోకేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఎవరికి అర్ధం కావట్లేదు. అతనికి కూడా నెక్స్ట్ ఏ సినిమా చేయాలన్న క్లారిటీ లేదన్నట్టు తెలుస్తుంది.

లోకేష్ ఆలోచనల్లో నెక్స్ట్ సినిమా మళ్లీ రజినీతోనే చేయాలని ఉందట. ఎందుకంటే రజినీ సినిమా కూలీతో అంచనాలను అందుకోని లోకేష్ మళ్లీ ఆయనతో ఒక రేంజ్ హిట్ అందుకుంటే తిరిగి ఫాంలోకి రావొచ్చని ప్లాన్ చేస్తున్నాడట. ఐతే రజినీ వెంటనే ఆ ఛాన్స్ ఇస్తాడా అన్నది మాత్రం చెప్పడం కష్టం.

లోకేష్ తెలుగు స్టార్స్ తో సినిమా చేస్తే..

కార్తి తో ఖైదీ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టాడని నిన్న మొన్నటిదాకా వార్తలు రాగా మళ్లీ సడెన్ గా లోకేష్ ఈ డెసిషన్ అతని ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఇక కూలీ ముందు వరకు లోకేష్ తెలుగు స్టార్స్ తో సినిమా చేస్తే చూడాలని కోరిన ఫ్యాన్స్ కూడా కూలీని చూశాక సైలెంట్ అయిపోయారు. సో లోకేష్ మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే ఏ స్టార్ అయినా ఛాన్స్ ఇస్తాడు. అప్పటివరకు అతని గురించి ఇలాంటి డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి.

సినిమా పరిశ్రమలో అంతే.. హిట్ పడితే ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే ఫ్లాప్ ఇస్తే పాతాళానికి తొక్కేస్తారు. ఇక్కడ ప్రతి సినిమా హిట్ రేసులో ఉండాల్సిందే. లియోతోనే లోకేష్ తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోలేదన్న టాక్ ఉండగా కూలీలో రజనీ, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో సినిమా మిస్ ఫైర్ అయ్యేలా చేశాడు. సో లోకేష్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా అది ఎవరితో ఏ సినిమాతో అవుతుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News