స్టార్ డైరెక్టర్ కు ఉన్న వింత అలవాటు
కూలీ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో భారీ తారగణం ఉంది. ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో స్టార్ హీరోను కూలీలో భాగం చేసిన లోకేష్ ఇప్పటికే ఈ మూవీకి విపరీతమైన బజ్ ను తీసుకొచ్చారు.;
మనుషులన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. కొంతమందికి తాము తిన్నా తినకపోయినా బట్టలు కొనుక్కోవడం ఇష్టమైతే, మరికొందరికి తమకు నచ్చిన ఫుడ్ తినడం ఇష్టం. ఇంకొందరైతే బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడతారు. మరికొంత మంది తమ సంపాదనను బట్టి రియల్ ఎస్టేట్స్, స్టాక్స్, వివిధ రంగాలో రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ తమ ఆదాయాన్ని మరింత పెంచుకుంటూ ఉంటారు.
అయితే ఈ అలవాట్లకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ప్రతీ ఒక్కరికీ తమ టేస్ట్, ఇష్టాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అయితే యాక్షన్ ప్యాక్డ్ సినిమాలతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు కూడా ఓ అలవాటు ఉంది. కానీ ఆ అలవాటు వింటే ఎవరైనా ఆశ్చర్యపడక మానరు.
లోకేష్ కు రైఫిల్ క్లబ్ లో మెంబర్‌షిప్
లోకేష్ కు తుపాకులపై ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అట. వినడానికి షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ కనగరాజ్ ఒప్పుకున్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని తాను తుపాకీల ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతానని, అలా చేయడం తనకు ఆనందాన్నిస్తుందని లోకేష్ తెలిపారు. తనకు రైఫిల్ షూటింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ అని, అందులో భాగంగానే తాను రైఫిల్ క్లబ్ లో మెంబర్‌షిప్ కూడా తీసుకున్నట్టు వెల్లడించారు.
కూలీ కోసం లోకేష్ రెమ్యూనరేషన్
అలవాటు లో భాగంగా క్రమం తప్పకుండా తాను గన్స్ పై ఇన్వెస్ట్ చేస్తానని చెప్తోన్న లోకేష్ ప్రస్తుతం తాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించిన కూలీ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. కూలీ ప్రమోషన్స్ లో భాగంగానే లోకేష్ ఈ సీక్రెట్ ను బయటపెట్టారు. అంతేకాదు, కూలీ మూవీకి తాను రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వస్తున్న వార్తలు కూడా నిజమేనని ఆయన ఒప్పుకున్నారు.
లోకేష్ సన్నిహితుల కోసం కొంత భాగం
కూలీ కోసం రూ.50 కోట్లు తీసుకున్న తాను అందులో కొంత భాగాన్ని ఆల్రెడీ గన్స్ పై ఇన్వెస్ట్ చేసినట్టు కూడా చెప్పారు. తాను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చానని, తనకు చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉందని చెప్పిన లోకేష్, తనతో పాటూ తన సన్నిహితులు కూడా ఎదగాలని కోరుకుంటానని, అందుకే తన ఆదాయంలో కొంత భాగాన్ని వారి కోసం కేటాయిస్తున్నానని కూడా తెలిపారు. తాను ఎదగడమే కాకుండా తన పక్కన వారిని కూడా ఎదిగేలా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయమని లోకేష్ ను ఈ విషయంలో అందరూ అభినందిస్తున్నారు.
కోలీవుడ్ మొదటి రూ.1000 కోట్ల సినిమాగా కూలీ?
కూలీ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో భారీ తారగణం ఉంది. ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో స్టార్ హీరోను కూలీలో భాగం చేసిన లోకేష్ ఇప్పటికే ఈ మూవీకి విపరీతమైన బజ్ ను తీసుకొచ్చారు. నాగార్జున విలన్ క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీకి మొదటి రూ.1000 కోట్ల సినిమా ఇవ్వబోతున్న డైరెక్టర్ గా లోకేష్ పై కోలీవుడ్ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆగస్ట్ 14న కూలీ రిలీజ్ కానుండగా మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.