హీరోగా లోకేష్ మూవీ.. ఖైదీ సీక్వెల్ వచ్చేలోపే..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాలపై మక్కువతో కస్టమర్ డిలైట్ షార్ట్ ఫిల్మ్ తీసి మెప్పించారు.;
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాలపై మక్కువతో కస్టమర్ డిలైట్ షార్ట్ ఫిల్మ్ తీసి మెప్పించారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు వల్ల ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మా నగరం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఖైదీతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.
మాస్టర్ తో మళ్లీ అలరించగా.. విక్రమ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత లియోతో ప్రేక్షకుల మందుకు వచ్చినా అనుకున్న రేంజ్ లో హిట్ సాధించలేకపోయారు. కానీ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పుడు కూలీ మూవీతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న రిలీజ్ కానుందీ చిత్రం.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో లోకేష్ లైనప్ లో బోలెడ్ భారీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలను లోకేష్ కనగరాజ్ తీయనున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. అలా ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో తెరగేట్రం చేయనున్నారని టాక్.
గ్యాంగ్ స్టర్ మూవీగా లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ సినిమా రానుందని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ లో సినిమా వర్క్స్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. సినిమా కోసం బాగా బరువు తగ్గి.. కండల కోసం వర్కౌట్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గడ్డం కూడా ఫుల్ గా పెంచుతున్నట్లు సినీ వర్గాల్లో వినికిడి.
అయితే ఖైదీ-2 మూవీ స్టార్ట్ చేయడానికి ఇంకా టైమ్ పడుతుందట. అందుకే ఈలోపు హీరోగా సినిమాను కంప్లీట్ చేస్తానని లోకేష్ తెలిపారు. అదే సమయంలో డైరెక్టర్ అరుణ్ కూడా కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ తో ఇళయరాజా బయోపిక్ చేయాల్సింది ఉంది. కానీ అది లేట్ కావడంతో ఇప్పుడు లోకేష్ మూవీ తీయనున్నారని సమాచారం. మరి లోకేష్- అరుణ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.