ఇమ్రాన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌పై లేఖ వాషింగ్టన్ మనోగతం!

నెగెటివిటీని దూరం పెడుతూ సంతోషం ..పనిపైనే దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమిం చగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ పరిణతి చెందిన ఆలోచనా విధానం ఎందరినో ఆకట్టుకుంటోంది.

Update: 2026-06-09 12:30 GMT

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు నిరంత‌రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా వారి ప్రేమ ప్రయాణాలు సామాజిక మాధ్యమాలలో .. మీడియాలో నిరంతరం చర్చనీయాంశాలుగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో తనకున్న బంధంపై భార్య లేఖ వాషింగ్టన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. తమ సంబంధం గురించి సమాజంలో వ్యక్తమయ్యే భిన్నమైన అభిప్రాయాల‌పై ఆమె హుందాగా స్పందించారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఇలాంటి పరిస్థితులను తాము ఎలా స్వీకరిస్తున్నారో రేఖ వివరించారు.

బాహ్య ప్రపంచం నుండి ఎలాంటి ఒత్తిడి ..విమర్శలు ఎదురైనా? వాటిని తమ వ్యక్తిగత బంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఆమె మాటల ద్వారా వ్యక్తమైంది. మనుషుల మధ్య ఉండే నిజమైన అనుబంధానికి- బయటి వ్యక్తుల తీర్పులతో సంబంధం ఉండదని లేఖ వాషింగ్టన్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సహజమని.. ముఖ్యంగా సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు విషయాలు మరింత సున్నితంగా మారుతాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర గౌరవంతో ముందుకు సాగడమే ఏ బంధానికైనా బలమైన పునాది అని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ చాలా కాలం తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ జంటపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న సృజనాత్మకత, సినిమా పట్ల ఉన్న అంకితభావం తమ బంధంలో సానుకూల వాతావరణాన్ని నిర్మించిందని చెప్పొచ్చు. ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలుస్తూ వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడటం వారి రిలేషన్‌షిప్‌లో ప్రత్యేకతగా కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల యుగంలో ఎదుటివారి జీవితాలపై సులభంగా వ్యాఖ్యలు చేసే ధోరణి పెరిగినా? వాటన్నింటికీ అతీతంగా తమ ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు లేఖ స్పష్టం చేశారు.

నెగెటివిటీని దూరం పెడుతూ సంతోషం ..పనిపైనే దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమిం చగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ పరిణతి చెందిన ఆలోచనా విధానం ఎందరినో ఆకట్టుకుంటోంది.

కళాకారులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంటూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో బాధ్యతా యుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. బ‌య‌ట‌ ప్రపంచం అంచనాలకు లోబడకుండా మనసుకు నచ్చినట్లు జీవించడమే నిజమైన స్వేచ్ఛ అని ఈ జోడీ ధోరణి నిరూపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ప‌దేళ్ల సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే.

వ్య‌క్తిగ‌త జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు కార‌ణంగానే మ‌ళ్లీ సినిమాలు మీద ప‌మ‌న‌సు పెట్ట లేక విరామం తీసుకుంటున్నాడు. అయితే హ్యాపీ ప‌టేల్ అనే సినిమాతో ఇదే ఏడాది కంబ్యాక్ అయ్యాడు. అయితే ఆ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ కేవ‌లం చిన్న రోల్ మాత్ర‌మే పోషించాడు. ఇమ్రాన్ ఖాన్ స్వ‌యానా అమీర్ ఖాన్ కు మేన‌ల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News