ముంబైని సొంత ఇల్లంటోన్న అర్యన్ ఖాన్ ప్రియురాలు!
| ఆర్యన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌పై వస్తున్న ప్రచారం నేపథ్యంలో బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బోనేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖాన్ కుటుంబం తనను సొంత మనిషిలా చూసుకుంటుందని, ముంబై ఇప్పుడు తన ఇల్లు అని తెలిపారు. ఆర్యన్ తెలివైన వ్యక్తి అని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఆయన దర్శకత్వంలో పనిచేయాలని ఉందని వెల్లడించారు.
బాద్ షా తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రెజిల్‌కు చెందిన మోడల్.. నటి లారిస్సా బోనేసీతో రిలేషప్ షిప్ లో ఉన్నట్లు కొంత కాలంగా ప్రచారం లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు..వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా లారిస్సా ముంబై నగరంతో ముడిపడిన..బాద్ షా ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. `ముంబై ఇప్పుడు పని కోసం వచ్చిన ఊరు మాత్కమే కాదు. ఇప్పుడిది నా సొంత ఇల్లు. ఖాన్ కుటుంబం నన్ను సొంత మనుషుల్లా చూసుకుంటారు. వారి అండదండలు తనకు ఎంతో విలువైనవ`న్నారు.
షారుఖ్ ఖాన్ ఒక లెజెండ్. ఆయన ఎప్పటికీ కింగ్‌గానే నంబర్ వన్‌గానే ఉంటారు. ఆయన నుంచి విజయాలు సాధించడం కంటే వాటిని ఎలా అందుకున్నారనే విషయంలోనే నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రా యపడ్డారు. ఇక `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` తో దర్శకుడిగా మారిన ఆర్యన్ ఖాన్‌పై కూడా అమ్మడు ప్రశంసలు కురిపించింది. ఆర్యన్ తెలివైనవాడని.. పట్టుదల కలిగినవాడని.. తన లక్ష్యాల కోసం నిజాయతీగా పోరాడే వ్యక్తి అని తెలిపింది. ఒకసారి ఆర్యన్ షో సెట్‌కు వెళ్లానని.. భవిష్యత్తులో ఆయన దర్శకత్వంలో పనిచేయాలని ఉందని మనసులోని మాట చెప్పింది.
మరో దేశం నుంచి వచ్చి బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని ఎత్తుపల్లాలు సహజమేనని లారిస్సా అన్నారు. కొత్తగా వచ్చేవారికి అవకాశాలు.. ఆదరణ దొరకడం కాస్త కష్టంగానే ఉంటుందని కానీ సమయం గడిచేకొద్దీ పరిస్థితులకు అలవాటు పడి ఇక్కడి మనుషులతో తప్పక మమేకమవుతామన్నారు. హిందీ నేర్చుకోవడానికి ఏ కోచింగ్ క్లాస్‌కూ వెళ్లలేదని.. రోజూ కలిసే ఆటోవాలాలతో మాట్లాడుతూనే నేర్చుకున్నానని తెలిపింది.
ఆ ప్రభావం తన హిందీలో స్పష్టంగా కనిపిస్తుందంది. ప్రస్తుతం ఆరు భాషలు మాట్లాడగలనని.. హిందీతో పాటు తెలుగులోనూ డైలాగులు చెప్పగలనని నవ్వేసింది. బ్రెజిలియన్ కంటే ఇండియన్‌గానే ఎక్కువ ఫీలవుతానని లారిస్సా తెలిపింది. పని కోసం ఇక్కడికి వచ్చినా? ఇక్కడి మనుషుల వల్లే ఇక్కడే ఉండిపోయానని బ్రెజిల్ వెళ్లిన ప్రతిసారీ తిరిగి ముంబై రావాలనిపిస్తుందంది. ఆర్యన్ లాంటి స్నేహితులు ఉండటం వల్ల ప్రయాణం సులభమైందా అన్న ప్రశ్నకు తనకు ఇక్కడ పెద్ద స్నేహబృందం, కుటుంబం ఉన్నాయని బ్రెజిల్ కంటే ఇక్కడే తనకు ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నారంది. ప్రస్తుతం లారిస్పసా `1920: కోల్డ్ వింటర్` అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.