కమ్ములా మార్క్ సెన్సిబిలిటీతో ట్రాన్స్ ఆఫ్ కుబేర!
శేఖర్ కమ్మలా తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కుబేర` రిలీజ్ కు రెడీ అవుతోంది.;
శేఖర్ కమ్మలా తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కుబేర` రిలీజ్ కు రెడీ అవుతోంది. కమ్ములా తొలి సారి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో? సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ధనుష్..నాగార్జున పస్ట్ లుక్ పోస్టర్ తోనే కమ్ములా గ్యాంగ్ స్టర్ స్టోరీనే కొత్తగా చెప్ప బోతున్నాడు? అన్నది అర్దమైంది. అటుపై రిలీజ్ అయిన గ్లింప్స్ సహా ప్రతీ ప్రచార చిత్రం సిని మాపై అంచనాలు పతాక స్థాయికి తీసుకెళ్లాయి.
తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేరా స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది. ఇది రెగ్యులర్ టీజర్లకు భిన్నం. కథలో నాలుగు పాత్రల స్వభాన్ని మాత్రమే హైలైట్ చేసారు. ఇందులో ఎలాంటి డైలాగులుండవ్. ఎమోషన్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. డబ్బు, భావోద్వేగం, విలువలు అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని కట్ చేసిన టీజర్ ఇది. ధనుష్, నాగార్జున, జిమ్ సర్బ్, రష్మిక పాత్రల చుట్టూనే టీజర్ హైలైట్ అవుతుంది.
`అది నాది నాది ఈ లోకమంతా` నేల నాది...నింగి నాది పూత వేసే చేను నాది. కాలి నాదు కనులు నాది సిరులు నాది` అంటూ ఒక్క పాటలోనే పాత్రలను రివీల్ చేస్తూ సినిమా కాన్సెప్ట్ రివీల్ చేసారు. సమస్యల్లో ఇరుక్కున్న నాగార్జున సతమతమవ్వడం..ప్రభుత్వ అధికారిగా అతడి ఎమోషన్ ఆద్యంతం ఆకట్టు కుంటుంది. ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తున్న జిమ్ సర్బ్ పాత్రను ఎంతో రిచ్ గా హైలైట్ అవుతుంది.
బిలీయనీర్ రోల్ లో అతడి ఆహార్యం ఆకట్టుకుంటుంది. కుభేరగా ఉన్న ధనుష్ బికారిగా మారడం. భార్య తో వివాదం..అతడి పాత్రలో బలమైన ఎమోషన్ రక్తి కట్టిస్తుంది. మనిషి స్వార్ధం, ఆశ, అత్యాశ ఎలాంటి పరిస్థి తుల్లోకి నెట్టుతాయి? అన్నది రెండు పాత్రల మధ్య హైలైట్ అవుతుంది. కమ్ములా మార్క్ సెన్సిబి లిటీస్ ఎక్కడా మిస్ అవ్వలేదు ‘నాది నాది.. నాదే ఈ లోకమంతా’ అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యం ఇంట్రెస్టింగ్. ఈ పాట టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.