'కుబేర' ట్రైలర్ చూశారా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మించారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. పాన్ ఇండియా లెవెల్ లో కుబేర మూవీ జూన్ 20వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఆడియన్స్ లో సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. మేకర్స్ వాటిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు క్రేజీ రెస్పాన్స్ గా.. ఇప్పుడు ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా టీజర్ తో శాంపిల్ ను మేకర్స్ చూపించగా.. ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. సినిమా కచ్చితంగా చూడాలనేంతగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తోంది. ప్రస్తుతం కుబేర ట్రైలర్.. సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్ లో గత రాత్రి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని క్లియర్ గా అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పటిలానే శేఖర్ కమ్ముల...స్టోరీని దాచకుండా ట్రైలర్ ద్వారా రివీల్ చేశారని అంటున్నారు.
శేఖర్ కమ్ముల మార్క్ ఫుల్ గా కనిపిస్తుందని అంటున్నారు. అయితే కేవలం ఎమోషన్స్, లవ్ ట్రాక్ తో పాటు మనీ క్రైమ్ అంశాన్ని యాడ్ చేయడం కొత్త ఉందని.. ప్రతి రోల్ కు ఆయన ప్రాధాన్యమిచ్చినట్లు అర్థమవుతుందని చెబుతున్నారు. స్టోరీ చాలా డెప్త్ గా ఉన్నట్లు.. ఆత్మపరిశీలనతో ఉందని అభిప్రాయపడుతున్నారు.
ట్రైలర్ ఇంట్రెస్ట్ ను.. ఉత్కంఠను పెంచుతుందని అంటున్నారు. ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారని.. ప్రతి సీన్ కు కూడా ప్రాణం పోసినట్టు ఉన్నారని చెబుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ గా బాధ్యత కలిగిన పదవిలో కనిపించిన నాగార్జున.. ఎప్పటిలానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తారని కామెంట్లు పెడుతున్నారు.
రష్మిక రోల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుందని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం సినిమాకు సపోర్ట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయని, ఏదేమైనా హిట్ బొమ్మ అని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.