క్రిష్-4..ధూమ్ -4 ఆలస్యానికి కారణాలు?
బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తోన్న రెండు భారీ ఫ్రాంచైజీ చిత్రాలు `క్రిష్ 4`, `ధూమ్ 4`. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ? చెప్పాల్సిన లేదు.
బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తోన్న రెండు భారీ ఫ్రాంచైజీ చిత్రాలు `క్రిష్ 4`, `ధూమ్ 4`. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ? చెప్పాల్సిన లేదు. అయితే ఈ ప్రాజెక్ట్‌లు అనూహ్యంగా ఆలస్యం అవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జాప్యానికి కారణాలు చిన్నవి కాదు. మేకర్స్ అనుసరిస్తున్న గ్లోబల్ స్ట్రాటజీనే ప్రధాన కారణమని తాజాగా వెలుగులోకి వస్తోంది. ఈ రెండు చిత్రాలను భారతీయ మార్కెట్‌కే పరిమితం చేయకుండా గ్లోబల్ వైడ్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పోటీ పడాలంటే కంటెంట్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారుట. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు దీటుగా టెక్నికల్ వాల్యూస్ ఉండేలా ప్లాన్ చేస్తుండటంతో ప్రీ-ప్రొడక్షన్ దశలోనే భారీ సమయం పడుతోందని సమాచారం. ఈ సినిమాల ఆలస్యానికి అసలు సిసలు కారణం భవిష్యత్తు కాలాన్ని అంచనా వేసే టెక్నికల్ కాన్సెప్ట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఉన్న అడ్వాన్స్ కల్చర్, ట్రెండ్స్ కన్నా పదేళ్ల తర్వాత ప్రజలు ఎంత అడ్వాన్స్‌గా ఉంటారు? వారి ఆలోచనా విధానం ఎలా మారుతుంది? అనే కోణంలో ఈ కథలను మలుస్తున్నారుట.
ఈ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్‌ను టెక్నికల్‌గా హైలైట్ చేస్తూ తెరకెక్కించడమే భారీ ప్రాజెక్ట్‌లు ఆలస్యం కావడానికి అసలు కారణమని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. హృతిక్ రోషన్ తన సూపర్ హీరో ఇమేజ్‌ను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్న `క్రిష్ 4` సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్‌ను అత్యంత జాగ్రత్తగా సిద్దం చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ..సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ టెక్నీషియన్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు `ధూమ్ 4` విషయంలో కూడా సరికొత్త యాక్షన్ స్టంట్స్, గ్లోబల్ స్టాండర్స్డ్ ఉన్న చేజింగ్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేస్తుండటంతో అంతకంతకు ఆలస్యమవుతోందంటున్నారు. నేటి ప్రేక్షకుల అభిరుచులకు సరిపోయేలా కాకుండా రాబోయే దశాబ్ద కాలంలో టెక్నాలజీ .. వినోద రంగంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్‌ను సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఈ రెండు ప్రాజెక్ట్‌ల విషయంలో అగ్ర నిర్మాణ సంస్థలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాయి. ఈ గ్లోబల్ స్టాండర్డ్ అప్రోచ్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.
మొత్తానికి `క్రిష్ 4`, `ధూమ్ 4` చిత్రాలు ఆలస్యం అవుతున్నా? వాటి వెనుక ఉన్న టెక్నికల్ విజన్ ..గ్లోబల్ ప్లానింగ్ చూస్తుంటే ఈ సినిమాలు ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కించడం ఖాయమనిపిస్తోంది. కాలానికి తగినట్లుగా రూపాంతరం చెందుతున్న భారీ ప్రాజెక్ట్‌లు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.