సినిమాలు వదిలేద్దామనుకున్నా.. ఆ టైమ్ లో జుట్టు రాలిపోయి, చర్మ సమస్యలొచ్చాయి..
సినీ ఇండస్ట్రీ చూడ్డానికి మాత్రమే రంగుల ప్రపంచం. అందులో ఉండే కష్టాలు మరెందులోనూ ఉండవనేది ఇండస్ట్రీలో ఉండే వారికే తెలుసు.;
సినీ ఇండస్ట్రీ చూడ్డానికి మాత్రమే రంగుల ప్రపంచం. అందులో ఉండే కష్టాలు మరెందులోనూ ఉండవనేది ఇండస్ట్రీలో ఉండే వారికే తెలుసు. ఇండస్ట్రీలో కొనసాగాలంటే పడాల్సిన పాట్లు, చేయాల్సిన త్యాగాలు, ఎదుర్కోవాల్సిన కష్టాలు, సమస్యలు చాలానే ఉంటాయనే విషయం చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
హీరోల దగ్గర నుంచి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ఇండస్ట్రీలో ఉండటానికి ప్రతీ క్షణం ఎంతో కష్టించాల్సి ఉంటుంది. అందుకే ఇండస్ట్రీ చూడ్డానికే రంగుల ప్రపంచం అంటుంటారు. అందులోనూ హీరోయిన్లకు అయితే ఇంకాస్త ఎక్కువ కష్టాలుంటాయి. ప్రతీ ఫ్రేమ్‌లోనూ అందంగా కనిపించడానికి రెగ్యులర్ గా స్కిన్ కేర్ మెయిన్‌టెయిన్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవి కాకుండా కొన్నిసార్లు ఒప్పుకున్న సినిమాలో ఎలా నటించాలో అనే భయం వల్లనో, ఏం చేయాలో తెలియకపోవడం వల్లనో కూడా టెన్షన్ పడుతుంటారు హీరోయిన్లు. ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా కెరీర్ స్టార్టింగ్ లో అలాంటి సమస్యనే ఎదుర్కొందట. తన మొదటి సినిమా ఉప్పెన టైమ్ లో తాను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి కృతి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఉప్పెన చేయడం చాలా కష్టంగా అనిపించింది
ఉప్పెన సినిమాకు వర్క్ చేయడం తనకు చాలా కష్టంగా అనిపించిందని, ఆ ఒత్తిడి వల్ల తనకు జుట్టు రాలడంతో పాటూ పలు చర్మ సమస్యలు కూడా వచ్చాయని, కొన్ని సిట్యుయేషన్స్ లో అసలు అన్నీ వదిలేయాలనుకున్నానని, కానీ అన్నింటినీ తట్టుకుని ముందుకు కొనసాగానని చెప్పుకొచ్చింది కృతి. అలా అన్నింటినీ ఎదుర్కొని ఉప్పెన సినిమా చేయగలిగింది కాబట్టే అమ్మడిని ఆ సినిమా ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసిన విషయమే.