కొరటాల దారెటు..?

రైటర్ గా సత్తా చాటి డైరెక్టర్ గా మారిన ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. అలాంటి వారిలో ఒకరు కొరటాల శివ.;

Update: 2025-11-28 03:45 GMT

రైటర్ గా సత్తా చాటి డైరెక్టర్ గా మారిన ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. అలాంటి వారిలో ఒకరు కొరటాల శివ. రైటర్ నుంచి డైరెక్టర్ టర్న్ తీసుకుంటూనే రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు కొరటాల శివ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు సినిమా తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నారు. శ్రీమంతుడు సినిమాతోనే మైత్రి మూవీ మేకర్స్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేశాడు. ఆ సినిమా కూడ్డా సూపర్ హిట్ అయ్యింది.

భరత్ అనే నేను తర్వాత దాదాపు 4 ఏళ్లు టైం తీసుకున్న కొరటాల శివ..

ఐతే ఆ సినిమా తర్వాత రెండేళ్లకు మళ్లీ మహేష్ తోనే భరత్ అనే నేను సినిమా చేశాడు కొరటాల శివ. అది కూడా ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ కు వరుసగా రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్ లిస్ట్ లో కొరటాల శివ చేరాడు. ఐతే భరత్ అనే నేను తర్వాత దాదాపు 4 ఏళ్లు టైం తీసుకున్న కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ తో ఆచార్య సినిమా చేశారు. ఆ సినిమా కొరటాల శివకు ఫస్ట్ షాక్ ఇచ్చింది.

సినిమా మీద ఉన్న అంచనాలు.. అందులోనూ చిరు, చరణ్ మల్టీస్టారర్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు ఎక్కువ అయ్యాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయిన ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆచార్య పోయినా సరే తనకు జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఇచ్చాడని మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRR తర్వాత దేవర ఛాన్స్ ఇచ్చాడు. దేవర సినిమా ముందు ఒక పార్ట్ గా అనుకుని మధ్యలో రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.

దేవర 2 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు..

దేవర పార్ట్ 1 రిలీజైంది.. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఫ్యాన్స్ ని మెప్పించింది. ఆచార్య తర్వాత కొరటాల మంచి కంబ్యాక్ అనుకున్నారు. ఐతే దేవర 2 తో పార్ట్ 1 చూసి డిజప్పాయింట్ అయిన వారిని కూడా సాటిస్ఫై చేయాలని అనుకున్నారు. కానీ దేవర 2 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దేవర 2 కోసమే కొరటాల శివ ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అటకెక్కేస్తే నెక్స్ట్ కొరటాల శివ ఏం చేస్తాడన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

కొరటాల శివ చేస్తానంటే స్టార్ హీరోలు కూడా ఆఫర్ ఇస్తారు. కానీ స్టార్స్ అంతా తక్కువలో తక్కువ రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ మీడియం రేంజ్ హీరోలతోనే కొరటాల శివ నెక్స్ట్ అటెంప్ట్ చేయాలి. అది ఎవరితో ఎలాంటి సినిమా అన్నది చూడాలి. దేవర 2 ఆగిపోవడంతో కొరటాల శివ దారెటు అన్నది కాస్త కన్ ఫ్యూజన్ గానే ఉందని చెప్పొచ్చు. అందుకే సినీ పరిశ్రమలో హిట్టు పడితే ఎలా ఎంకరేజ్ చేస్తారో ఫ్లాప్ పడితే అంతకు డబల్ తొక్కేస్తారని అంటుంటారు. కొరటాల శివ విషయంలో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్ లాంటి మంచి సినిమాలు అందించిన కొరటాల శివ కంబ్యాక్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆయన నెక్స్ట్ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News