కిరణ్- రహస్య.. రొమాంటిక్ మూమెంట్!
అయితే పెళ్లి తర్వాత వరుస సినిమాలు, రహస్య ప్రెగ్నెంట్ అవ్వడంతో బయటకు వెళ్లలేకపోయిన కిరణ్.. తాజాగా భార్య రహస్యతో అలా బయటకు వెళ్లి సరదాగా గడిపాడు.;
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కిరణ్ అబ్బవరం - రహస్య గోరక్ ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. చిన్నారికి హను అని నామకరణం చేశారు. పిల్లాడి ఫొటోలు కూడా కిరణ్ రివీల్ చేశాడు. అయితే పెళ్లి తర్వాత వరుస సినిమాలు, రహస్య ప్రెగ్నెంట్ అవ్వడంతో బయటకు వెళ్లలేకపోయిన కిరణ్.. తాజాగా భార్య రహస్యతో అలా బయటకు వెళ్లి సరదాగా గడిపాడు.
తమ పెళ్లి జరిగి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కిరణ్- రహస్య ఔటింగ్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను రహస్య సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇందులో కిరణ్ తనకు ఏదో నోట్ రాస్తున్న ఫొటో కూడా ఉంది. ఇక డిన్నర్ టైమ్ రహస్య తీసిన సెల్ఫీలో కిరణ్ కూడా కనిపిస్తున్నాడు. ఇద్దరూ హ్యాపీ నవ్వుతూ ఫొటోకు పోజిస్తున్నారు. ఈ పోస్టు చూస్తే ఇది క్యాండిల్ నైట్ డిన్నర్ లాగా అనిపిస్తుంది. ఈ పోస్టుకు సుదీర్ఘమైన క్యాప్షన్ రాసుకొచ్చింది.
అతను పెళ్లి చేసుకోవడానికి ఒక గంట ముందు నేను చాలా భయపడ్డాను. నా గుండె దడదడలాడింది. అతను ఈ నోట్ తో నా దగ్గరకు వచ్చినప్పుడు.. ఆ క్షణం అంతా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. నేను ఏమి చేసిన అతను చూసుకుంటాడులే అన్న నమ్మకం ఇచ్చాడు. ఒక అమ్మాయికి తన భర్త నుంచి ఇంతకంటే ఏం కావాలి. ఇదే ఉత్తమ బహుమతి అని నేను అనుకుంటున్నాను. నాకు ఆ ఉత్తమ బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు కిరణ్ నీకు థాంక్స్. హ్యాపీ యానివర్సరీ. అంటూ రహస్య రాసుకొచ్చింది.
అయితే ఆ నోట్ ను కూడా ఆమె పోస్ట్ చేసింది. అందులో నన్ను ఎంపిక చేసుకున్నందుకు చాలా థాంక్స్. నా జీవితంలోని నిన్ను ఆహ్వానిస్తున్నాను. బాగా చూసుకుంటాను. అని కిరణ్ ఓ నోట్ రాసి ఆమెకు పెళ్లికి ముందు ఇచ్చాడట. ఆ నోట్ ను రసహ్య ఇప్పుడు అభిమానులతో పంచుకుంది. ఆమె షేర్ చేసుకున్న ఫోటోలలో వారి బంధం, ఆప్యాయత కనిపిస్తున్నాయి. వివాహ తొలి వార్షికోత్సం ఇంత సింపుల్ గా జరుపుకున్నందుకు అభిమానులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాగే హ్యాపీగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, రాజావారు రాణి వారు సినిమాతో ఈ ఇద్దరు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. గతేడాది అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసున్నారు. పెళ్లి తర్వాత కిరణ్ కు కా సినిమా మంచి విజయం అందించింది. ఆ తర్వాత దిల్ రూబా విఫలమైంది. ఇప్పుడు కె రాంప్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.