టాలీవుడ్‌లో మారుతున్న సక్సెస్ ఫార్ములా ఇదేనా?

ఈ మార్పు హీరోల కెరీర్‌పైనా ప్రభావం చూపుతోంది. ఇమేజ్‌కు పరిమితమవకుండా కథకు అనుగుణంగా తమను తాము మార్చుకునే నటులకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Update: 2026-07-13 08:18 GMT

ఒకప్పుడు టాలీవుడ్‌లో సినిమా స‌క్సెస్ అంటే స్టార్ హీరో మార్కెట్, ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఫ్యాన్స్ హంగామానే మెయిన్ డిస్క‌ష‌న్ గా ఉండేది. భారీ స్టార్‌డమ్ ఉంటే కంటెంట్ ఎలా ఉన్నా ఫ‌స్ట్ వీకెండ్ లో కలెక్షన్లు వచ్చేస్తాయనే అభిప్రాయం కూడా బలంగా కనిపించేది. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ ట్రెండ్‌ను పరిశీలిస్తే పరిస్థితి మారుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడియ‌న్స్ ఇప్పుడు హీరో పేరు కంటే కథ, కథనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

రీసెంట్ గా రిలీజైన పలు సినిమాలు ఈ మార్పుకు ఉదాహరణగా నిలిచాయి. ఒకప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూసిన హీరోలు ఇప్పుడు స్ట్రాంగ్ కథలు, కొత్త తరహా పాత్రల్ని ఎంచుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ స‌క్సెస్‌ల‌లో హీరోల యాక్టింగ్ ఎంత ముఖ్యమో, అంతకంటే ఎక్కువగా డైరెక్ట‌ర్ల‌ విజన్ కూడా అంతే కనిపిస్తోంది. ఆడియ‌న్స్ ఇప్పుడు ఎవరు హీరో? అనే ప్రశ్న కంటే సినిమాను ఎవరు తెరకెక్కించారు? అనే అంశంపై కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో డైరెక్ట‌ర్ ఎక్కువగా తెరవెనుక ఉండేవారు. ఇప్పుడు మాత్రం వారి పేరే సినిమాకు బ్రాండ్‌గా మారుతోంది. కథను కొత్తగా చెప్పే విధానం,క్యారెక్ట‌ర్ల డిజైన్, ఎమోష‌న్స్ ను ఆడియ‌న్స్ కు చేరవేసే తీరు, కమర్షియల్ అంశాలను సమతుల్యం చేయడం వంటి అంశాలు స‌క్సెస్ ను డిసైడ్ చేస్తున్నాయి. అందుకే నేటి టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ల‌ పాత్ర గతంతో పోలిస్తే మరింత కీలకంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ మార్పు హీరోల కెరీర్‌పైనా ప్రభావం చూపుతోంది. ఇమేజ్‌కు పరిమితమవకుండా కథకు అనుగుణంగా తమను తాము మార్చుకునే నటులకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో ఒక స‌క్సెస్ తోనే పాన్ ఇండియా మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. భాషా పరిమితులను దాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు, టెక్నిక‌ల్ క్వాలిటీ, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సినిమాల‌కే దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది.

అందుకే తాజాగా స‌క్సెస్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు కిర‌ణ్ అబ్బ‌వ‌రం, నాగ‌చైత‌న్య‌, అఖిల్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టులపై ఇండ‌స్ట్రీలో ఆసక్తి నెలకొంది. వారు ఇక ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితం అవుతారా? లేక పాన్ ఇండియా స్థాయిలో తమ స్థానాన్ని బలపరుచుకుంటారా? అనే డిస్క‌ష‌న్ కొనసాగుతోంది. వారి త‌ర్వాతి సినిమాల‌ సెలెక్ష‌న్, డైరెక్ట‌ర్ ఛాయిస్, కథలో కొత్తదనం వంటి అంశాలే వారి కెరీర్ దిశను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే టాలీవుడ్‌లో స‌క్సెస్‌కి సంబంధించిన సమీకరణలు మారుతున్నాయి. స్టార్‌డమ్ ఇప్పటికీ ఒక బలం అయినప్పటికీ, అది ఒక్కటే స‌క్సెస్ ను హామీ ఇవ్వడం లేదు. స్ట్రాంగ్ స్టోరీ, డైరెక్ట‌ర్ విజన్, పాత్రకు న్యాయం చేసే నటన, నాణ్యమైన నిర్మాణ విలువలు కలిసొస్తేనే ప్రేక్షకులు సినిమాను విజయవంతం చేస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో హీరోలతో పాటు డైరెక్ట‌ర్లే అసలు బ్రాండ్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News