చ‌ర‌ణ్ వేగాన్ని అందుకోలేకపోయిన కియారా!

అయితే పాట‌లో చ‌ర‌ణ్ తో డాన్సు చేయ‌డం నా వ‌ల్ల కాదు బాబోయ్ అనేసింది ఓ సంద‌ర్భంలో. ఆన్ సెట్స్ లో ఆ పాట అనుభ‌వాల్ని తాజాగా పంచుకుంది.

Update: 2024-05-23 07:17 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-కియారా అద్వాణీ జంట‌గా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'గేమ్ ఛేంజ‌ర్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ తో కియారా తెర‌ను పంచుకోవ‌డం ఇది రెండ‌వ సారి. గ‌తంలో 'విన‌య విధేయ రామ‌'లోనూ ఈ భామ‌నే న‌టించింది. అందులో చ‌ర‌ణ్ కి ధీటుగా డాన్సుల్లోనూ అల‌రించింది. ఈ నేప‌థ్యంలో 'గేమ్ ఛేంజ‌ర్' లోనూ కియ‌రా ఎంత మాత్రం త‌గ్గ‌ద‌నే అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌..కియారా 'జర‌గండి జ‌ర‌గండి' పాట‌తో రచ్చ చేసిన సంగ‌తి తెలిసిందే.

పాట‌లో ఇద్ద‌రు పోటా పోటీగా డాన్సు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే పాట‌లో చ‌ర‌ణ్ తో డాన్సు చేయ‌డం నా వ‌ల్ల కాదు బాబోయ్ అనేసింది ఓ సంద‌ర్భంలో. ఆన్ సెట్స్ లో ఆ పాట అనుభ‌వాల్ని తాజాగా పంచుకుంది. 'ఇప్ప‌టివ‌ర‌కూ నేను చేసిన పాట‌ల్లో ఇదే క‌ష్ట‌మైన‌ది. దాదాపు ప‌ది రోజుల పాటు పాట చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఒక పాట కోసం ఇన్ని రోజులు షూటింగ్ చేసింది ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ పాట కోసం షూటింగ్ త‌ర్వాత కూడా రోజులో మూడు..నాలుగు గంట‌లు రిహార్స‌ల్స్ చేయాల్సి వ‌చ్చింది.

Read more!

చ‌ర‌ణ్ తో మ్యాచ్ చేయాల్సి రావ‌డంతో ఇంకాస్త ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఇందులో చాలా క‌ష్టైన స్టెప్స్ ఉన్నా ఇది నాకొక మంచి అనుభ‌వం. శంక‌ర్ సార్ తో ప‌నిచేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఆ కోరిక ఈ సినిమాతో తీరుతుంది. సినిమా ప‌ట్ల అంకిత భావం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న గ‌త సినిమాల‌కంటే చేసే ప్ర‌తీ సినిమా అత్యుత్త‌మంగా ఉండాల‌ని చూస్తారు. ఆయ‌న‌లో నాకు బాగా న‌చ్చిన క్వాలిటీ ఇది.

ప్ర‌తీ ఒక్క‌రూ ఇలా ఆలోచించగలిగితే మంచి ఫ‌లితాలు సాధించొచ్చు. సినిమాలో కొత్త ద‌నం త‌ప్ప‌నిస‌రిగా ఉండేలా నేను చూసుకుంటాను. కానీ కొన్ని ప్రాజెక్ట్ ల విష‌యంలో తెలిసో తెలియ‌కో? త‌ప్పిదాలు దొర్లుతాయి. అలాంటి వాటిని కూడా మ‌ళ్లీ పున‌రావృతం అవ్వ‌కుండా చూసుకుంటా. వీలైనంత వ‌ర‌కూ పర్పెక్ష‌న్ అనేది చూసుకుంటా' అని అంది.

Tags:    

Similar News