కియారా అద్వానీ ఆస్తుల విలువ 41 కోట్లు
అందాల తార కియారా అద్వానీ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.ఇటీవేల అమ్మడు నటించిన టాక్సిక్ కూడా రిలీజ్ అయింది.
అందాల తార కియారా అద్వానీ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.ఇటీవేల అమ్మడు నటించిన టాక్సిక్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను కియారా భారీగానే ఛార్జ్ చేసింది. కంటెంట్ బోల్డ్ గా ఉండటంతో అందుకు తగ్గట్టే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగావ్యక్తిగత సంపద.. రెమ్యునరేషన్ .. వ్యాపార ప్రకటనల సంపాదనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కియారా అద్వానీ మొత్తం నికర విలువ 41 కోట్లుగా ఉంటుందని అంచనా.
సినిమాలలో నటిస్తూనే, బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెల్లరీ, ఫిన్‌టెక్, లైఫ్‌స్టైల్ వంటి అనేక రంగాలకు చెందిన జాతీయ స్థాయి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కియారా ఆస్తులను గణనీయంగా పెంచుకుంటున్నారు. సినిమాల విషయానికి వస్తే కియారా అద్వానీ ఒక్కో ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. నివేదికల ప్రకారం ఆమె సినిమా బడ్జెట్ .. పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒక్కో సినిమాకు 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
`కబీర్ సింగ్`, `షేర్షా`, `భూల్ భులయ్యా 2` వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత అమ్మడి మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగింది. బాలీవుడ్‌కే పరిమితం కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనూ అగ్ర హీరోల సరసన నటిస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చాటుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన `గేమ్ చేంజర్` చిత్రంలో నటించిన అమ్మడు యష్‌తో కలిసి `టాక్సిక్` చిత్రంలో నటించడంతో ఇమేజ్‌ను మరింత పటిష్టం చేసుకున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కియారికి ఉన్న ఫాలోయింగ్ కూడా బ్రాండ్ ప్రమోషన్స్‌లో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.
పరిశ్రమలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే తనదైన నటనతో పాటు అద్భుతమైన వ్యాపార వ్యూహాలతో సంపదను కూడగట్టుకోవడంలో కియారా సఫలమయ్యారు. కియారా పెట్టుబడులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ , విజయవంతమైన ప్రాజెక్ట్‌ల ఎంపిక యువ నటీమణులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. ఆమె కెరీర్ గ్రాఫ్ రోజురోజుకు మరింత మెరుగు పడుతోంది. మొత్తానికి వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో వెండితెరను ఏలుతూనే మరోవైపు కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టుకుంటున్న కియారా అద్వానీ సక్సెస్ జర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం కియారా కొత్త ప్రాజెక్టులు వేటికి కమిట్ అవ్వలేదు. కొన్ని నెలల పాటు టాక్సిక్ షూటింగ్ లోనే పాల్గొన్నారు. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయిన నాటి నుంచి విరామంలోనే ఉన్నారు. భర్త...పాపాయితోనే కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.