కియరాకు కొత్త తలనొప్పి.. పాతవి తవ్వి తీసి దారుణంగా!
సాధారణంగా సెలబ్రిటీల పాత వీడియోలను ఎవరో ఒకరు తవ్వి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇవన్నీ యూత్ లో వైరల్ అవుతూనే ఉంటాయి.;
కియారా అద్వానీకి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో బీఫ్ (గోమాంసం), పోర్న్ నిషేధంపై చేసిన వ్యాఖ్యల కారణంగా నెటిజన్లు తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు.. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటిది. అప్పట్లో ప్రభుత్వం విధించిన కొన్ని నిషేధాల గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు విమర్శలకు దారితీశాయి. ఆ ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. ``దేశంలో పోర్న్, బీఫ్ నిషేధించడం వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతోంది. ప్రజలు ఏం చూడాలి.. ఏం తినాలి అనేది వారి వ్యక్తిగత ఇష్టం. ఇలాంటి వాటిపై నిషేధం విధించడం కంటే దేశంలో ఉన్న ఇతర ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టాలి`` అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఈ వీడియో బయటకు రావడంతో చాలా మంది కియరాపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మతపరమైన మనోభావాలను గౌరవించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు! అని కొందరు.. అసలు ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఎందుకు ఇప్పుడు వైరల్ అవుతోంది?
సాధారణంగా సెలబ్రిటీల పాత వీడియోలను ఎవరో ఒకరు తవ్వి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇవన్నీ యూత్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపైనా, నటీనటుల వ్యక్తిగత అభిప్రాయాలపైనా సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇవన్నీ గతంలో చేసిన వ్యాఖ్యలే అయినా కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అవి వివాదాస్పదంగా మారాయి. మనోభావాలు దెబ్బ తినే కాలంలో ఇలాంటి వీడియోలను ప్రత్యేకంగా విశ్వేషిస్తోంది ఈ ప్రపంచం. కియారా అద్వానీ ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తనపై వస్తున్న విమర్శల విషయంలో కియారా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త వివరణ రాలేదు. కియరా అద్వాణీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటకు పండంటి ఆడ బిడ్డ (సరయా) జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతా సినిమాల పరంగా కియరా జోరు తగ్గలేదు.
గేమ్ ఛేంజర్, వార్ 2 తరవాతా కియరా లైనప్ అసాధారణంగా ఉంది. ప్రస్తుతం యష్ సరసన పాన్ ఇండియన్ చిత్రం టాక్సిక్ లో నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ సినిమాలో కియారా (నాడియా) పాత్ర యూనిక్ గా ఉంటుందని సమాచారం. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కియారా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, తన కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. షారూఖ్ ఖాన్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న `డాన్ 3`లో కియారా నటిస్తారని కథనాలొచ్చాయి. కానీ దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్ని ఉంది. క్రేజీ సీక్వెల్ మూవీ `నో ఎంట్రీ 2`లో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్‌జిత్ దోసాంజ్‌లతో కలిసి నటించనుంది. మొత్తానికి కియారా అటు సౌత్ , ఇటు నార్త్ సినిమాలతో పాటు పాన్-ఇండియా రేంజ్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.