• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి.. కీర్తి రిజెక్ట్...

కల్కి.. కీర్తి రిజెక్ట్ చేసిందా..

| ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-08-12 09:36 GMT

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా 1150 కోట్ల కి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా కల్కి నిలిచింది. నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏవీ కూడా కల్కి కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశం లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే కల్కి సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రోబోటిక్ కారు బుజ్జికి కీర్తి సురేష్ స్వరం అందించింది. సినిమాలో బుజ్జి క్యారెక్టర్ కి కీర్తి సురేష్ చెప్పిన డబ్బింగ్ బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ప్రభాస్ బుజ్జి మధ్య కాస్త హ్యుమర్ క్రియేట్ కావడంలో కీర్తి సురేష్ వాయిస్ కూడా కారణమనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ఉప్పు కప్పురంబు అనే చిత్రాన్ని చేస్తోంది.

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీగా ఈ చిత్రం రెడీ అవుతోంది. మరోవైపు తమిళంలో కీర్తి సురేష్ చేసిన రఘు తాత మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ కల్కి సినిమా గురించి ప్రస్తావించింది. ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం నాగ్ అశ్విన్ తనని సంప్రదించారని తెలిపింది. ఆ క్యారెక్టర్ ను తిరస్కరించినట్లు చెప్పింది. కానీ కల్కి చిత్రంలో ఎలా అయిన భాగం కావాలని కీర్తి సురేష్ కోరిందంట.

దీంతో నాగ్ అశ్విన్ బుజ్జి పాత్రకి డబ్బింగ్ చెప్పాలని సూచించినట్లు తెలిపింది. తను కూడా వెంటనే ఒప్పుకొని ఆ పాత్రకి వాయిస్ ఇచ్చినట్లుగా కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. అయితే నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ కి ఏ పాత్ర ఆఫర్ చేశారు అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. కల్కి సినిమాలో చాలామంది యాక్టర్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. కీర్తి సురేష్ గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.

అందుకే కల్కి చిత్రంలో ఆమెను కూడా భాగం చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన బుజ్జి క్యారెక్టర్ కల్కి పార్ట్ 2లో కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతుంది. తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది. వరుణ్ ధావన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలు చేస్తోంది. తెలుగులో కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. గత ఏడాది దసరా సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.

Tags:    
  • Keerthysuresh 
  • Tollywood 
  • Kalki 
  • Kalki2898AD 
  • Nagashwin 
  • Prabhas 
  • Babyjohn 
  • Raghuthatha 
  • Kollywood 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS