కీర్తి కాంట్రవర్సీ సినిమా.. తెలుగు ట్రైలర్ లో ఏం ఉంది?
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కీర్తి సురేష్ మళ్ళీ బిజి అవుతోంది. ఇక ఆమె ఎంచుకునే పాత్రలు కాంట్రవర్సికి దూరంగానే ఉంటాయి.
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కీర్తి సురేష్ మళ్ళీ బిజి అవుతోంది. ఇక ఆమె ఎంచుకునే పాత్రలు కాంట్రవర్సికి దూరంగానే ఉంటాయి. కానీ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'డొరొతీ' మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేసేసింది. తమిళంలో ఇప్పటికే రిలీజ్ అయి బోల్డ్ కంటెంట్‌తో పెద్ద కాంట్రవర్సీకి దారితీసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను లేటెస్ట్ గా విడుదల చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తెలుగు ట్రైలర్ కోసం మేకర్స్ కొత్తగా ఎలాంటి కసరత్తులు చేయలేదు. గత నెలలో తమిళం కోసం ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేశారో, దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా మక్కీకి మక్కీ దించేసి, కేవలం తెలుగు డైలాగ్స్ తో డబ్ చేసి వదిలారు.
ట్రైలర్ కట్‌లో పెద్దగా మార్పులు లేవు. చిన్ననాటి నుంచి కలిసున్న ఇద్దరు స్నేహితులు (సనంత్, రిషికాంత్), వాళ్ళిద్దరూ కలసి చేసే అల్లరి, ఊరి గొడవలు, పగలు, ప్రతీకారాలు.. వీటన్నింటి మధ్యలోకి ఒక తెల్లచీరకట్టుతో కీర్తి సురేష్ ఎంట్రీ ఇవ్వడం, అప్పటివరకు ప్రాణ స్నేహితుల్లా ఉన్నవాళ్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడం.. ఈ డార్క్ అండ్ రా విజువల్స్ అన్నీ తమిళ ట్రైలర్‌ను తలపించాయి.
ఈ ట్రైలర్‌ను చూస్తుంటేనే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు మార్క్ రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా అనేది అర్థమవుతోంది. దానికి తోడు మేస్ట్రో ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ గ్రిప్పీ ఫీల్‌ను అమాంతం పెంచేసింది. పెద్దయ్యాక మనం.కూడా ఇలా ముద్దు పెట్టుకోవాలి' అంటూ మొదలైన ట్రైలర్.. 'మగాళ్లు ఏడవకూడదు.. కేవలం ఆడవాళ్లే ఏడవాలా?' అనే ఎమోషనల్ డైలాగ్‌తో ఎండ్ అవ్వడం చూస్తుంటే ఇందులో ఏదో బలమైన డ్రామా దాగుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తమిళంలో ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి కారణం, ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయని ఆ 'బోల్డ్ సీక్రెట్' పాయింటే. కీర్తి సురేష్ క్యారెక్టర్ ఎంట్రీతో ఇద్దరు మిత్రుల మధ్య వచ్చే ఆ అనుకోని మలుపు, ఆ తర్వాత జరిగే సంఘటనలు కోలీవుడ్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఆ సస్పెన్స్‌ను అలానే మెయింటైన్ చేయడం విశేషం. జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న కీర్తి లాంటి హీరోయిన్ ఇలాంటి రిస్క్ తీసుకోవడం మామూలు విషయం కాదు.
ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా క్లైమాక్స్ మీద టాలీవుడ్ ఆడియన్స్‌లో కూడా ఒక రకమైన క్యూరియాసిటీ బిల్డ్ అయింది. తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేసే రానా దగ్గుబాటి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం మరో ప్లస్ పాయింట్. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ఈ 'డొరొతీ'.. ఆ వివాదాస్పద కంటెంట్‌తో తెలుగు నాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.