ఆ గ్యాప్ ను కీర్తి ఇలా కవర్ చేస్తుందా?
నేను శైలజ తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలు చేశారు.;
నేను శైలజ తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలు చేశారు. తెలుగు లో చేసిన మొదటి సినిమానే మంచి హిట్ అవడంతో తర్వాత కీర్తికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ టైమ్ లోనే తెలుగులోని స్టార్లతో కలిసి నటించిన కీర్తి, మహానటి సినిమాలో సావిత్రిగా నటించి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
వరుస సినిమాలను లైన్ లో పెట్టిన కీర్తి
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని ప్రేమించి పెళ్లి చేసుకున్న కీర్తి, పెళ్లి తర్వాత కాస్త స్పీడు తగ్గించిందని అందరూ అనుకున్నారు. పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమాలు తప్పించి కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని, పెళ్లైందని కీర్తికి ఆఫర్లు తగ్గాయా లేదా అమ్మడిని మెప్పించే కథలతో డైరెక్టర్లు ఆమెను సంప్రదించడం లేదా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో కీర్తి మళ్లీ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు.
విజయ్ దేవరకొండతో రౌడీ జనార్థన్
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ ఇప్పుడు పలు భాషల్లో అద్భుతమైన లైనప్ తో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్థన్ అనే రొమాంటిక్ యాక్షన్ మూవీ చేస్తున్న కీర్తి, హిందీలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం అక్క అనే పీరియాడికల్ డ్రామాను కూడా చేస్తున్నారు.
కోలీవుడ్ లో మిస్కిన్ తో కలిసి ఓ కోర్టు రూమా డ్రామా చేస్తున్న కీర్తి, దాంతో పాటూ రివాల్వర్ రీటా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటూ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ తొట్టంలో కూడా కీర్తి కనిపించనున్నారు. చూస్తుంటే పెళ్లి తర్వాత వచ్చిన గ్యాప్ ను కీర్తి వరుస సినిమాలతో పూరించడానికే ఇలా సాలిడ్ లైనప్ తో రానుందని అనిపిస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో కీర్తి నుంచి పలు క్రేజీ ప్రాజెక్టులు రానున్నాయి.