కీర్తి-ఆంటోని: పెళ్లికి ముందు 15 ఏళ్లు.. పెళ్లయాక ఒక ఏడాది!
కీర్తి - ఆంటోనీ నడుమ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని తాజాగా షేర్ చేసి ఫోటోలు, వీడియో చెబుతున్నాయి.;
15 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ మంచి స్నేహితులు. కుటుంబాల మధ్యా సాన్నిహిత్యం ఉంది. అలాంటి సంబంధం నిజంగా ఇరు కుటుంబాలకు ఎంతో హాయిగొలుపుతుంది. చివరకు అది సుఖశాంతులతో ఆదర్శ దాంపత్యంగా మారితే ఆ ఆనందానికి హద్దు ఉంటుందా? ఇప్పుడు అలాంటి ఆనందం గురించి మాట్లాడుకుంటున్నారు అభిమానులు. అందాల కథానాయిక కీర్తి సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు ఆంథోనీని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహమిది. ఆంథోని దుబాయ్ లో వెల్ సెటిల్డ్. కీర్తితో అతడు నిండా ప్రేమలో ఉన్నాడని పెళ్లికి ముందు చాలా కథనాలొచ్చాయి. ఇద్దరూ కొన్నేళ్ల పాటు విదేశాలలో షికార్లు చేసారు. ప్రేమ పక్షుల గురించి అప్పుడప్పుడు పుకార్లు పుట్టుకొచ్చినా కానీ ఇంత సీరియస్ రిలేషన్ అని ఏనాడూ భావించలేదు. చివరికి ఈ ప్రేమజంట ఒకటైంది.
గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఇప్పుడు వారి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకున్నారు. గోవాలో జరిగిన హిందూ - క్రిస్టియన్ స్టైల్ వివాహ వేడుకల నుండి కొన్ని అందమైన ఫోటోలు బయటకు వచ్చాయి. వివాహం జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, ఈ జంట అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ మెమరబుల్ డేను గుర్తు చేసుకుంటూ.. ఇలా రాసారు. ``ఎ కోర్ డే, ఎ కోర్ మెమరీ, 1 ఇయర్ ఆఫ్ #ఫర్ ది లవ్ ఆఫ్ నైక్`` అని రాశారు.
కీర్తి - ఆంటోనీ నడుమ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని తాజాగా షేర్ చేసి ఫోటోలు, వీడియో చెబుతున్నాయి. పాటలు, డ్యాన్సులతో ప్రతి ఫ్రేమ్‌లో ఉల్లాసం, ఫ్యామిలీ టగ్ ఆఫ్ వార్.. సరదా ఆటలు వీటిలో కనిపించాయి. పెళ్లి ఆచారాలలో ఆంటోనీ కీర్తి మెడలో మాల వేయడం.. తన ప్రేమను వ్యక్తపరచడానికి ఒంటి మోకాలిపై కూర్చోవడం వంటివి ప్రధానంగా హైలైట్. పెళ్లి వేడుకల నుంచి అందమైన ఫోటోలను షేర్ చేసిన కీర్తి తన ఆనందమయ జీవితాన్ని చెప్పకనే చెప్పింది. పెళ్లాయినా అనవసరమైన ఒత్తిళ్లు లేకుండా హాయిగా తన నటనా కెరీర్ ని కీర్తి కొనసాగిస్తోంది.
నిజానికి కీర్తి తన నటనా జీవితం ప్రారంభించక ముందే ఆంటోనీతో కలిసి ఉన్నారు. వారి 15 సంవత్సరాల సంబంధం హ్యాపీగా జాయ్ తో కొనసాగింది. దుబాయ్ కేంద్రంగా ఆంటోనీ వ్యాపారం కొనసాగుతోంది. కీర్తి రెగ్యులర్ గా దుబాయ్ విజిట్ కి వెళ్లిన ఫోటోలు ఇంటర్నెట్ లో షికార్లు చేసాయి. ఇక ఆంటోనీ కుటుంబం కేరళలోని కొచ్చికి చెందినది. హిందూ- మలయాళీ క్రైస్తవ నేపథ్యాలలో సంప్రదాయాలను ఒకచోటకు చేరుస్తూ భిన్న మతస్తులు పెళ్లి చేసుకోవడం అభిమానులను ఆకర్షించింది. 12 డిసెంబర్ 2024న పెళ్లి అనంతరం కీర్తి తిరిగి తన పెండింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. కీర్తికి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. ఉప్పు కప్పురంబు , రివాల్వర్ రీటా వంటి చిత్రాలలో నటించినా ఇవి ఆశించిన విజయాల్ని అందించలేదు. తమిళంలో కన్నివేది , మలయాళంలో తొట్టం వంటి క్రేజీ చిత్రాలలో నటించనుంది.