• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2024 లో నాలుగు రిలీజ్...

2024 లో నాలుగు రిలీజ్ లు.. అయినా కూడా..?

| అందులో ఒక సినిమా సక్సెస్ అవ్వగా మరోటి ప్రేక్షకులను అలరించింది.

By - Tupaki Desk
Update: 2024-08-14 16:30 GMT

రామ్ పూరీ జగన్నాథ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ లో ఉన్న హీరోయిన్స్ నే ఇందులో రిపీట్ చేస్తాడని అనుకోగా పూరీ ఫోకస్ లోకి కొత్త భామ కావ్య థాపర్ వచ్చి చేరింది. ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కావ్య థాపర్ ఏక్ మిని కథ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ ఇయర్ ఈగల్, ఊరు పేరు భైరవకోన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కావ్య. అందులో ఒక సినిమా సక్సెస్ అవ్వగా మరోటి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అమ్మడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.


రామ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేసిన కావ్య ఈ సినిమాతో తన గ్లామర్ యాంగిల్ ని చూపించాలని చూస్తుంది. పూరీ సినిమాల్లో హీరోయిన్స్ అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటారు. ఒక్కసారి పూరీ చేతుల్లో పడ్డాడు అంటే అప్పటివరకు ఉన్న ఇమేజ్ డబు అవుతుంది. అందుకే డబుల్ ఇస్మార్ట్ మీద అమ్మడు అంచనాలు పెట్టుకుంది. కెరీర్ లో అన్ని ప్రయోగాలు చేయాలని ఉందన్న కావ్య యాక్షన్ సినిమాల మీద తన ఆసక్తి బయట పెట్టింది.

ఇక చిరంజీవి, ఎన్టీఆర్ ల డాన్స్ అంటే ఇష్టం అంటున్న అమ్మడు చరణ్, నాని లాంటి స్టార్స్ తో నటించాలని ఉందని అంటుంది. డబుల్ ఇస్మార్ట్ లో అమ్మడు యాక్షన్ సీన్స్ కూడా చేసిందని టాక్. ఐతే రామ్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అంటున్న అమ్మడు స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఉందన్న కోరికను బయట పెట్టింది. ఐతే ఇస్మార్ట్ శంకర్ ఆడిషన్ కు వస్తే అప్పుడు ఛాన్స్ ఇవ్వని పూరీ డబుల్ ఇస్మార్ట్ లో అవకాశం ఇచ్చాడు.

ఇక ఈ ఇయర్ ఆల్రెడీ ఈగల్, భైరవకోన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కావ్య గురువారం డబుల్ ఇస్మార్ట్ తో వస్తుంది. నెక్స్ట్ అమ్మడు గోపీచంద్ విశ్వం సినిమాలో కూడా నటిస్తుంది. సో 2024 లో అమ్మడు ఏకంగా నాలుగు సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన రెండు సినిమాలు ఆమె కెరీర్ కు అంత గొప్పగా ఉపయోగపడలేదు కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం కచ్చితంగా అమ్మడికి మరిన్ని ఛాన్సులు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • DoubleiSmart 
  • Ram 
  • Kavyathapar 
  • Sanjaydutt 
  • PuriJagannadh 
  • Eagle 
  • Chiranjeevi 
  • Ntr 
  • Ramcharan 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS