బలగం భామ వాటితో సరిపెడుతోంది..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా వాళ్లని చూసిన ఆడియన్స్ పెద్దయ్యాక వారు లీడ్ రోల్స్ చేసినా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారా లేదా అన్నది చెప్పడం కష్టం;

Update: 2025-04-22 21:30 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారికి పెద్దయ్యాక సినిమా ఆఫర్లు రావడం చాలా అరుదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వాళ్లని చూసిన ఆడియన్స్ పెద్దయ్యాక వారు లీడ్ రోల్స్ చేసినా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారా లేదా అన్నది చెప్పడం కష్టం. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి సక్సెస్ అయిన తరుణ్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాల వల్ల ఫేడవుట్ అయిపోయాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరోయిన్ గా కూడా చేసిన భామలు ఉన్నారు. వారిలో ఎవరు టాప్ రేంజ్ కి వెళ్లింది లేదు.

ఈ క్రమంలో చైల్డ్ రోల్స్ చేసి మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ మసూధ తో తిరిగి ఎంట్రీ ఇచ్చి బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. బలగం హిట్ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన కావ్య ఆ తర్వాత ఎందుకో అవకాశాలు అందుకోలేదు. సినిమా ఛాన్స్ లు ఎలా ఉన్నా అమ్మడు ఫోటో షూట్స్ తో మాత్రం కేక పెట్టిస్తుంది. సినిమాల్లో ఛాన్స్ లు రావాలంటే ఫోటో షూట్స్ తప్పనిసరి అనే విషయాన్ని కనిపెట్టిన అమ్మడు రకరకాల ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.

ఒక మోస్తారు ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కూడా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటారు. అందుకే కావ్య కళ్యాణ్ రామ్ కూడా అదే దారిలో అటు సినిమాల లెక్క ఎలా ఉన్నా సరే ఫోటో షూట్స్ విషయంలో మాత్రం చాలా ఫోకస్డ్ గా ఉంది. కావ్య ఫోటో షూట్స్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అందుకే అమ్మడు ఎప్పుడు ఫోటో షూట్ చేసినా కూడా అది వైరల్ అవుతుంది. ముఖ్యంగా అమ్మడు శారీతో చేసే ఫోటో షూట్స్ కి ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు.

తెలుగు హీరోయిన్స్ లో తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ రావాలని ట్రై చేస్తున్న అమ్మడు ఫోటో షూట్స్ ని బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఐతే ఇలా ఫోటో షూట్స్ తో సరిపెట్టడమేనా సినిమాలు చేసేది ఏమైనా ఉందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నా ఎవరు ఏమైనా అనుకోని తను చేసేది చేసుకుంటూ వెళ్తానని అంటుంది అమ్మడు. అంతేకాదు ఖాళీగా ఉన్నాం కదా అని ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకుండా కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది కావ్య. అందుకే వరుస సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. మరి కావ్య కళ్యాణ్ రాం నెక్స్ట్ సినిమా ఏది అవుతుంది. ఫోటో షూట్స్ లో కాకుండా ఆమెను తెర మీద ఎప్పుడు చూస్తామంటూ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News