• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌టాక్ : బలగం బ్యూటీ...

పిక్‌టాక్ : బలగం బ్యూటీ కవ్వింపులు

| అయినా కావ్య తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-18 04:46 GMT

బాల నటిగా గంగోత్రితో పాటు పలు సినిమాల్లో నటించి ముద్దుగా మాట్లాడుతూ, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించిన కావ్య కళ్యాణ్‌రామ్‌ ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తోంది. 2022లో టాలీవుడ్‌లో మసూద సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కావ్యకి అనుకోని అదృష్టం అన్నట్లుగా బలగం సినిమాలో నటించడం, భారీ విజయం దక్కడం జరిగింది.


బలగం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా తెలుగు అమ్మాయి, పైగా చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసింది అనే కారణంతో కావ్య కి తెలుగులో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. అయినా కావ్య తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.


సాధారణంగానే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలని ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. ఎక్కువ శాతం మంది సినిమాల్లో అడుగు పెట్టి ఆఫర్లు రాకపోవడంతో కొన్నాళ్లకు కనుమరుగు అవుతున్నారు. కానీ కావ్య మాత్రం సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో సినిమాలు చేస్తూ వస్తోంది.


బలగం సినిమా హిట్‌ కావడంతో ఆ తర్వాత కొన్ని చిన్న చితకా ఆఫర్లు వచ్చాయి. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. ఇక కావ్య సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.


రెగ్యులర్‌ కావ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలతో వైరల్‌ అవుతూ ఉంటుంది. ఈసారి సెల్ఫీ క్లిక్స్‌ ను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. తన అందమైన రూపంను మిర్రర్‌ సెల్ఫీ ద్వారా నెటిజన్స్‌ కి షేర్‌ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వగల కావ్య కళ్యాణ్ రామ్‌ మరోసారి ఈ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. స్కిన్‌ షో పెద్దగా చేయకుండా కాస్త నడుము కనిపించేలా ఈ అమ్మడు చేస్తున్న కవ్వింపులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కావ్య అందంకు ఇంకాస్త ఎక్కువ ఆఫర్లు రావాల్సిందే అని, ఆమె చాలా తక్కువగా ఆఫర్లు పొందుతుందని అంటున్నారు.


బలగం సినిమా తర్వాత కావ్య కి సినిమాలతో పాటు సిరీస్‌ల్లోనూ నటించే అవకాశాలు వచ్చాయి. పలు టీవీ షో ల్లో కనిపించిన కావ్య ఒక వైపు సినిమాలు మరో వైపు సిరీస్‌లు చేయాలని భావించడం లేదట. సినిమాలు చేస్తున్నప్పుడు సిరీస్‌లను చేయను అంటూ ఆ మధ్య చెప్పిందట. అయితే సిరీస్‌ల్లో మంచి పాత్ర ఆఫర్‌ వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ మరో సందర్భంలో ఆమె చెప్పింది. మొత్తానికి నటిగా తనను తాను నిరూపించుకునేందుకు సాధ్యం అయినంత వరకు సినిమాలు చేస్తాను అంటూ ఆమె హామీ ఇచ్చింది. అందుకే ఇలా అందమైన ఫోటోలతో కన్నుల విందు చేస్తూ కవ్విస్తోంది.

Tags:    
  • Kavyakalyanram 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actresskavyakalyanram 
  • Phototalk 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS