తెర వెనుక కష్టానికి గాయాలే సాక్ష్యం!
సినిమా రంగంలో తెరపై కనిపించే నటీనటుల మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో కఠిన శ్రమ, ప్రాణాలను పణంగా పెట్టే సాహసాలు దాగి ఉంటాయి.
సినిమా రంగంలో తెరపై కనిపించే నటీనటుల మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో కఠిన శ్రమ, ప్రాణాలను పణంగా పెట్టే సాహసాలు దాగి ఉంటాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్ .. సౌత్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు షూటింగ్‌ల సమయంలో తీవ్రమైన గాయాల బారిన పడుతున్నారు. కార్తీక్ ఆర్యన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, నిమ్రత్ కౌర్ అహ్లువాలియా వంటి స్టార్లు వరుసగా ఇంజూరీస్ ఎదుర్కొంటున్న ఘటనలు చర్చనీ యాంశంగా మారుతున్నాయి.
యువ హీరో కార్తీక్ ఆర్యన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్‌లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటుండగా గాయపడ్డారు. ప్రమాదకరమైన విన్సెంట్లు .. స్టంట్స్ చేసే సమయంలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. అయి నప్పటికీ అంకితభావంతో షూటింగ్‌ను కొనసాగించిన కార్తీక్ తెగువను అభిమానులు ప్రశంసిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మాస్ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ తరహా గాయాలు సర్వ సాధారణంగా మారుతున్నాయి.
మరోవైపు బిజీ షెడ్యూల్స్ మధ్య శ్రమిస్తున్న నటి రష్మిక మందన్న కూడా ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డారు. నిరంతర ప్రయాణాలు, భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్‌లతో తీరికలేకుండా గడుపుతున్న భామ శారీరక ఒత్తిడి , రిస్కీ సీన్ల కారణంగా స్వల్ప గాయాలను ఎదుర్కొన్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.టెలివిజన్ నుంచి సినిమాలకు ఎదిగిన నిమ్రత్ కౌర్ అహ్లువాలియా వంటి నటీమణులు కూడా ఇటీవల ఫిట్‌నెస్ సెషన్స్ .. షూటింగ్ స్పాట్లలో గాయాలపాలయ్యారు.
ఈ ఘటనలన్నీ సెలబ్రిటీల దైనందిన జీవితంలో ఫిట్‌నెస్, యాక్షన్ ఎంతటి రిస్క్‌తో కూడుకున్నవో తెలియజేస్తున్నాయి. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచే స్టార్లు తెరవెనుక పడుతున్న శ్రమకు ఈ గాయాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇండస్ట్రీలో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లకు మారుతున్న ట్రెండ్, విజువల్ వండర్స్ కోసం మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు నటీనటుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బాడీ డబుల్స్ కాకుండా నటీనటులే స్వయంగా సాహసాలు చేయడానికి ముందుకు రావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే దర్శక నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా? చిన్న పాటి తప్పిదాలు కారణంగా గాయాలు తప్పడం లేదు.
గ్లామర్ ప్రపంచం వెనుక కష్టాల గురించి వరుస గాయాలు మరోసారి కళ్లకు కడుతున్నాయి. ఎన్నో ఇబ్బందులను, నొప్పులను భరించి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్న నటీనటుల నిబద్ధతను అంతా అభినందించాల్సిం దే. గాయాల నుంచి కోలుకుని మరింత ఉత్సాహంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి నటీనటులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.