ఫోటో స్టోరి: బెబో కాదు.. దేవతా సుంద‌రి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ లక్మే ఫ్యాషన్ వీక్ 25వ వార్షికోత్స‌వ‌ ఉత్స‌వాల్లో షో స్టాప‌ర్ గా నిలిచారు.;

Update: 2025-03-31 19:34 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ లక్మే ఫ్యాషన్ వీక్ 25వ వార్షికోత్స‌వ‌ ఉత్స‌వాల్లో షో స్టాప‌ర్ గా నిలిచారు. ఈ వేదికపై తన ఫ్యాషన్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ... తన సైజు-జీరో రోజుల నుండి కొడుకు తైమూర్ తో గర్భం దాల్చే వరకు తన జీవితంలోని వివిధ దశలలో ర్యాంప్ వాక్ చేసినట్లు గుర్తుచేసుకుంది.


ర్యాంప్ పై క‌రీనా దేవ‌తా సుంద‌రిని త‌ల‌పించింది. క‌రీనా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌మ్మీ అనే సంగ‌తి ఈ లుక్ లో చూసినప్పుడు ఎవరికీ గుర్తు రాదు. అంత‌గా న‌వ‌య‌వ్వ‌న రూపంతో మైమ‌రిపించింది. ఇది పొడ‌వాటి ట్రెడిష‌న‌ల్ లెహంగా లుక్. మెడ‌లో ప‌చ్చ‌ల హారంతో బెబో ప‌ర్ఫెక్ట్ లుక్ లో క‌నిపించింది. దీనికి క‌రీనా ఇచ్చిన క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది.


ఈ రాత్రి చాలా స్పెషల్... లాక్మే ఫ్యాషన్ వీక్ 25 సంవత్సరాల వేడుక‌ జరుపుకుంటున్న సంద‌ర్భ‌మిది... లక్మీ గర్ల్ గా నేను ఉన్నాను! నాకు గుర్తున్నంత కాలంగా లాక్మే నా ప్రయాణంలో చాలా పెద్ద భాగం. ఈ మైలురాయిలో భాగం కావడం నిజంగా గౌరవం. మనమంతా తిరిగి కలిసి ఇక్కడకు చేరుకున్నాం.. ఎందుకంటే మ‌నం క‌లిసిన ప్ర‌తిసారీ మంచి విష‌యాలు జ‌రుగుతాయి.. అని బెబో అంది.


చాలా సంవత్సరాలుగా లక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ల కోసం ర్యాంప్‌వాక్ చేసిన‌ కరీనా కపూర్ ఖాన్, ప‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసారు. వాస్తవానికి ప్ర‌ముఖ డిజైనర్లు.. ఐకాన్‌లు స్టైలిస్ట్ లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్‌లు, కొరియోగ్రాఫర్లు.. వేదిక వెనుక ఉన్న 60 మంది మోడళ్లు! అంద‌రితో షో ఆక‌ట్టుకుంద‌ని క‌రీనా ప్ర‌శంసించారు.

Tags:    

Similar News