నర్స్ వృత్తిపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు!

ఆనాటి వలసరాజ్యాల పాలనలో ప్రవేశపెట్టిన ఈ శైలి కారణంగా మన దేశంలోని సాధారణ ప్రజలకు వారు ఒక రకమైన విదేశీయులు లాగా కనిపిస్తారని.

Update: 2026-06-08 08:49 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్ ముక్కు సూటి త‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. విష‌యం ఏదైనా నిర్మోహ మాటంగా మాట్లాడుతుంది. అది పాజిటివ్ అయినా? నెగిటివ్ అయినా? స‌రే అవేమి ప‌ట్టించుకోకుండా మాట్లాడిన త‌ర్వాత‌ చూసుకుందాం? అన్న‌ట్లే అమ్మ‌డి వైఖ‌రి క‌నిపిస్తుంది. ఈనేప‌థ్యంలో తాజాగా నర్సింగ్ వృత్తి ఆ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న గౌరవ లోపం గురించి కంగ‌న చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సరికొత్త చర్చకు.. వివాదానికి తెర తీసాయి. సమాజంలో అత్యంత పవిత్రమైన సేవా వృత్తులలో ఒకటైన నర్సింగ్‌ను కొందరు చూసే విధానంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమాజంలో నర్సులకు దక్కాల్సిన అసలైన గౌరవం దక్కడం లేదని కంగనా అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తూ మన సమాజంలో ..పాప్ కల్చర్‌లో నర్స్ వృత్తిని అత్యంత లైంగికీకరించబడిన వృత్తిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే వైద్య సిబ్బందిని కేవలం గ్లామర్ కోణంలోనో? లేదా? తక్కువ చూపుతోనో చూడటం సమాజం చేస్తోన్న పెద్ద తప్పు అని ఘాటుగా విమర్శించారు. దీనికి సంబంధించి కొన్ని కార‌ణాల‌ను కూడా విశ్లేషించారు. ప్రస్తుతం నర్సులు ధరిస్తున్న దుస్తుల శైలి పూర్తిగా బ్రిటిష్ కాలం నాటి సంస్కృతికి ప్రతీకగా ఉందని పేర్కొన్నారు.

ఆనాటి వలసరాజ్యాల పాలనలో ప్రవేశపెట్టిన ఈ శైలి కారణంగా మన దేశంలోని సాధారణ ప్రజలకు వారు ఒక రకమైన విదేశీయులు లాగా కనిపిస్తారని.. దీనివల్ల రోగులకు, నర్సులకు మధ్య ఉండాల్సిన సహజమైన ఆత్మీయ బంధం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. మన దేశ సంస్కృతికి, మూలాలకు సరిపోయేలా ఈ దుస్తుల విధానంలో మార్పులు రావాలని కంగన సూచించారు. పాశ్చాత్య దేశాల శైలిని అనుకరించడం కంటే మన భారతీయ వాతావరణానికి ..సంప్రదాయానికి అనుగుణంగా ఉండే ఖాదీ లేదా ఇతర స్థానిక వస్త్రాలతో కూడిన సౌకర్యవంతమైన యూనిఫామ్‌ను కేటాయించాలని కోరారు.

భారతీయ శైలిలో దుస్తులు ఉన్నప్పుడు రోగులు వారిని తమ ఇంట్లో వారిలా, ఒక తల్లిలా లేదా సోదరిలా భావించి మరింత గౌరవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె విశ్లేషణను సమర్థిస్తూ, సినిమాల్లో ..ఐటెం సాంగ్స్‌లో నర్సుల పాత్రలను తప్పుగా చూపించడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం వృత్తిపరమైన దుస్తులకు వారికి లభించే గౌరవానికి సంబంధం లేదని ఆలోచనా విధానంలో మార్పు రావాలే తప్ప బట్టలలో కాదని కంగనా వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

Tags:    

Similar News