• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊహకు అందని విధంగా 'కల్కి'...

ఊహకు అందని విధంగా 'కల్కి' అప్‌డేట్స్

| యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వం

By - Tupaki Desk
Update: 2023-07-25 04:55 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం తెలుగు ప్రేక్షకుల నుండి పాన్‌ వరల్డ్‌ ప్రేక్షకుల వరకు వెయిట్‌ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. తాజాగా టైటిల్ ను రివీల్ చేస్తూ అంతర్జాతీయ వేదిక మీద గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది.

గ్లిమ్స్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా అంతకు మించి అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి.. ప్రశాంత్ నీల్‌.. శంకర్ తీసిన సినిమాలు 'కల్కి 2898 ఏడీ' సినిమా ముందు దిగదుడుపే అన్నట్లుగా గ్లిమ్స్ ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది. మొదటి నుండి కూడా ఇదో పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు... అది నిజమే అనిపిస్తుంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్స్ అమితాబచ్చన్‌.. కమల్‌ హాసన్.. దీపికా పదుకొనే.. దిశా పటానీ ఇంకా ఎంతో మంది నటీనటులు ఉన్నారు. ఇక ఈ సినిమా కు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో సినిమాకు హాలీవుడ్‌ క్రేజ్ దక్కబోతుంది.

సినిమాలోని విజువల్స్.. కథ.. ఇతర విషయాలు అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ సినిమా అన్నట్లుగా నిలుపబోతున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్‌.. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉన్న కారణంగా సంక్రాతికి సాధ్యం కాదని తేలిపోయింది. 2024 సమ్మర్ లో సినిమా రాబోతుంది.

ప్రస్తుతానికి ఈ సినిమా ప్రమోషన్ హడావుడి చేయకూడదని నిర్ణయించుకున్నారు. మరో రెండు నెలల్లో ప్రభాస్ సలార్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవ్వబోతున్నాయి. ఈ సమయంలో కల్కి ప్రమోషన్స్ చేస్తే గందరగోళం అయ్యే అవకాశం ఉంది.

అందుకే సలార్ సినిమా విడుదల అయిన తర్వాత వరుసగా మూడు నాలుగు నెలల పాటు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తారట. ఆ అప్‌డేట్స్ తో ప్రేక్షకులు సైతం షాక్ అవుతారని.. ఊహకు అందని అప్డేట్స్ తో యూనిట్‌ సభ్యులు సినిమా ప్రమోషన్ చేయబోతున్నారు. సినిమా లోని కథ మరియు పాత్రలు కూడా ఊహకు అందని విధంగా ఉన్న విషయం తెల్సిందే.

Tags:    
  • Kalki2898AD 
  • Prabhas 
  • NagAshwin 
  • ProjectK 
  • Tollywood 
  • kalki 
  • KalkiMovie 
  • Kalki 
  • KalkiFilm 
  • DeepikaPadukone 
  • KamalHasan 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS