పిక్‌టాక్‌ : బీచ్‌లు సిస్టర్స్ ముద్దు రచ్చ రచ్చ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా కాజల్‌ అగర్వాల్‌ టాలీవుడ్‌లో కొనసాగుతోంది.;

Update: 2025-06-30 06:36 GMT

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా కాజల్‌ అగర్వాల్‌ టాలీవుడ్‌లో కొనసాగుతోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా కాజల్‌ సినిమాలు తగ్గాయి, కానీ ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా ముందులా నటించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ టాలీవుడ్‌లో ఆమెకు మునుపటి మాదిరిగా సినిమా ఆఫర్లు రావడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గా కాజల్‌ చేసిన ఎన్నో సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ అనే విషయం తెల్సిందే.


ఇటీవల మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కన్నప్ప' సినిమాలోనూ అత్యంత కీలకమైన పార్వతిదేవి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో లీడ్‌ రోల్స్ కాకుండా ఇలా గెస్ట్‌ అప్పియరెన్స్ ఇస్తూ వస్తున్న కాజల్‌ అగర్వాల్‌ ఛాన్స్ లభిస్తే లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించేందుకు, యాక్షన్‌ సీన్స్‌ కు కూడా రెడీ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటికీ అదే అందం, అదే ఫిజిక్‌తో చూపు తిప్పుకోనివ్వడం లేదు. తాజాగా మరోసారి కాజల్‌ అగర్వాల్‌ ఫోటోలు ఇన్‌స్టాలో వైరల్‌ అవుతున్నాయి. ఈసారి ఆమె సిస్టర్‌ నిషా అగర్వాల్‌తో ఉన్న ఫోటోలు కావడంతో పాటు బీచ్‌లో బికినీలో ఉండటంతో మరింతగా చూపు ఆకర్షిస్తున్నాయి.


కాజల్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ట్రిప్‌లో తీసుకున్న ఫోటోలను అప్పుడప్పుడు షేర్‌ చేస్తూ వస్తుంది. తాజాగా నిషా అగర్వాల్‌ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. కాజల్‌ అగర్వాల్‌కి బీచ్‌లో కూర్చుని ముద్దు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు సిస్టర్స్ బీచ్‌లో బికినీలో ఉన్నారు. సాధారణంగానే ముద్దుగుమ్మలు బీచ్‌లో బికినీలో ఉంటే చూపు తిప్పడం కష్టం. అలాంటిది ఇద్దరు సిస్టర్స్ బికినీలో ఉండటంతో చూపు తిప్పలేక పోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ మాత్రమే కాకుండా నిషా అగర్వాల్‌ కూడా చాలా అందంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సముద్రంలో వీరిద్దరూ సరదాగా తీసుకున్న ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ కావడంతో నిషా అగర్వాల్‌కి అదృష్టం కలిసి రాలేదు కానీ, స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కి ఉంటే తప్పకుండా పెద్ద హీరోయిన్‌గా పేరు దక్కించుకుని ఉండేది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిషా అగర్వాల్ పలు సినిమాల్లో నటించినప్పటికీ లక్‌ కలిసి రాకపోవడంతో హిట్‌ పడలేదు. దాంతో అక్క కాజల్‌ కంటే ముందే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిర పడింది. ఇప్పుడు చెల్లితో పాటు అక్క కాజల్‌ అగర్వాల్‌ కూడా సంసార జీవితంలో స్థిర పడింది. వీరిని ఇలా చూసిన వారు చాలా మంది ఇద్దరు కలిసి ఏదైనా ఒక సినిమాలో నటిస్తే బాగుండేది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News