చంద‌మామ సెకెండ్ ఇన్సింగ్స్ ఊపెక్క‌డ‌?

దశాబ్దంన్నరకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చందమామగా వెలిగిపోయిన కథానాయిక కాజల్ అగర్వాల్.

Update: 2026-07-20 13:30 GMT

దశాబ్దంన్నరకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చందమామగా వెలిగిపోయిన కథానాయిక కాజల్ అగర్వాల్. ఎంతో మంది అగ్రనటుల సరసన నటించింది. స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసింది. అయితే 2020లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో వేగం ఒక్క‌సారిగా త‌గ్గింది. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగి స్తున్నప్పటికీ? గతంలో ఉన్నంత జోరు సెకండ్ ఇన్నింగ్స్‌లో క‌నిపించ‌డం లేదు. ఈ నాలుగైదు ఏళ్లలో ఆమె చేసిన చిత్రాల సంఖ్య చాలా పరిమితంగా ఉండటంతో అమ్మ‌డు చర్చనీయాంశమ‌వుతోంది.

వివాహానంతరం కాజల్ ఎంచుకున్న ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టి సారించినా? అవి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించడంలో విఫలమయ్యాయి. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న కాజల్ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అమ్మ‌డి కెరీర్ గ్రాఫ్ గతంతో పోలిస్తే మందగించడానికి కథల ఎంపిక కూడా ప్రధాన కారణమని వాద‌నా లేక‌పోలేదు.

అలాగే పాత్రల ఎంపికలో కాజల్ విధించుకున్న గ్లామర్ హద్దులు కూడా అవకాశాలను ప్రభావితం చేశాయన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న కాజల్ పెళ్లి తర్వాత ఆ హద్దులను మార్చుకోవడం వల్ల కొన్ని భారీ కమర్షియల్ ప్రాజెక్టులు చేజారి ఉండొచ్చు. ఇప్పటి తరం ప్రేక్షకులు , దర్శక నిర్మాతలు, కథ డిమాండ్‌కు తగ్గట్టుగా పాత్రలు ఉండాలని ఆశిస్తున్నారు. కాజల్ పాత ఇమేజ్‌కు భిన్నంగా వెళ్లడం వల్ల దర్శక నిర్మాతల ఆలోచనల్లో ఆమె స్థానం మారి ఉండొచ్చు.

టాలీవుడ్‌లో మారుతోన్న ట్రెండ్స్ కూడా ఆమెకు సవాలుగా మారాయి. ప్రస్తుతం పరిశ్రమలో కొత్త నటీమణుల రాక పెరగడం, కథల్లో హీరోయిన్ల పాత్రల స్వభావం పూర్తిగా మారిపోవడంతో కాజల్ వంటి సీనియర్ తారలు తమను తాము మలచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా? క్యారెక్టర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించినట్లు కనిపిస్తోంది. కానీ అలాంటి పాత్రలు ఆమెకు లభించడం ప్రస్తుతానికి కష్టంగానే ఉంది.

అయితే కాజల్ అగర్వాల్‌కు ఉన్న స్టార్ డమ్ అంత సులువుగా చెరిగిపోయేది కాదు. ఆమెకు ఇప్పటికీ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. సరైన దర్శకుడు, పవర్‌ఫుల్ స్క్రిప్ట్ దొరికితే మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇటీవలి కాలంలో వివాహం చేసుకున్న ఎంతోమంది నటీమణులు రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పాత్రలతో ఫామ్‌లోకి వచ్చిన ఉదాహరణలున్నాయి. కాజల్ కూడా ఎంపికలో మార్పులు చేసుకుంటే? మళ్ళీ సంచలనాలు సృష్టించడం ఖాయం.

కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతున్నా? కమ్ బ్యాక్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. గ్లామర్ పరిమితులు అనేవి ఒక దశ వ‌ర‌కే ప‌రిమితం. కానీ కాజ‌ల్ అనుభవం, నటన వెలకట్టలేనివి. రాబోయే రోజుల్లో కాజల్ పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తే? మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తుంద‌ని అభిమానులు ఆశీస్తున్నారు.

Tags:    

Similar News