అప్పుడే సెట్ లోకి అడుగు పెడుతున్న విరోష్ జంట!
ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు తమ సినిమా షూటింగ్ లతో ఎంత బిజీ అవుతున్నారంటే..ఆఖరికి తమ జీవితంలో అత్యంత కీలక ఘట్టమైన వివాహానికి కూడా కనీసం నెల రోజులు కూడా కేటాయించలేకపోతున్నారు .;
ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు తమ సినిమా షూటింగ్ లతో ఎంత బిజీ అవుతున్నారంటే..ఆఖరికి తమ జీవితంలో అత్యంత కీలక ఘట్టమైన వివాహానికి కూడా కనీసం నెల రోజులు కూడా కేటాయించలేకపోతున్నారు . ముఖ్యంగా తమను నమ్ముకున్న నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదు అనే ఒక కారణంతోనే సెలబ్రిటీలు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ త్వరగా సినిమాలు కంప్లీట్ చేయాలని చూస్తూ ఉండడం సెలబ్రిటీల నిబద్ధతకు అద్దం పడుతోంది
ఈ క్రమంలోనే గతేడాది ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ డైరెక్టర్ నిడిమోరు తో ఏడడుగులు వేసింది. అయితే వివాహం జరిగిన నాలుగు రోజులకే ఆమె తన తెలుగు చిత్రమైన 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆమె బాటలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట కూడా నడవబోతోంది. పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే అప్పుడే ఈ జంట తమ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
వివరాలలోకి వెళ్తే.. దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట.. ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న ఉదయపూర్ హిందూ, కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం మార్చి 3వ తేదీన తమ సొంత గ్రామమైన తుమ్మన్ పేటలో విజయ్ దేవరకొండ తన భార్యతో కలిసి నూతన గృహప్రవేశం చేయడమే కాకుండా ఆ ఊరి ప్రజలందరికీ విందు ఏర్పాటు చేశారు. సత్యనారాయణ వ్రతం అనంతరం ఏర్పాటు చేసిన ఈ విందులో ఊరి ప్రజలంతా సంతోషంగా పాల్గొన్నారు. అలాగే అచ్చంపేట పరిధిలో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలలో 9 , 10వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.. పైగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వివాహం జరిగి 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సినిమా షూటింగ్లో ఈనెల 12 నుంచి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగే ఈ షెడ్యూల్లో కీలక నటీనటులంతా కూడా పాల్గొంటారని సమాచారం.. వేగంగా షూటింగ్ ను కంప్లీట్ చేసి సెప్టెంబర్ 11న విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఈ హ్యాట్రిక్ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కొత్త జంట వివాహం అనంతరం వెంటనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతుండడంతో సినిమా పట్ల వీరికున్న ప్యాషన్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.