జూన్ లో సందడి చేయనున్న చిత్రాలివే!

అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది.. ఈ నేపథ్యంలోనే మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందివ్వడానికి కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అంటున్నారు హీరోలు .

Update: 2026-05-21 08:59 GMT

సాధారణంగా ఇండియన్ బాక్సాఫీస్ కి పండుగ సెలవులు ఏ విధంగా అయితే కలిసి వస్తాయో.. సమ్మర్ హాలిడేస్ కూడా అంతకుమించి కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్ ను మాత్రం పెద్ద హీరోలు ఉపయోగించుకోలేదని చెప్పాలి. వాస్తవానికి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పెద్ద పెద్ద హీరోలు ఈ సమ్మర్ ను టార్గెట్గా చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది.. ఈ నేపథ్యంలోనే మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందివ్వడానికి కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అంటున్నారు హీరోలు . ఈ క్రమంలోనే ఈసారి సమ్మర్ కి ఎన్నో పెద్ద పెద్ద చిత్రాలు మిస్ అయినా.. జూన్లో మాత్రం అలరించడానికి సిద్ధమైపోయారు. మరి ఈ ఏడాది జూన్ నెలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుతోంది.. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

పెద్ది : జూన్ 4

జూన్ నెల రాంచరణ్ పెద్ది మూవీతో గ్రాండ్ గా ప్రారంభం కానంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా , జాన్వి కపూర్ హీరోయిన్గా రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ రొమాంటిక్ మూవీ గా వస్తున్న పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ట్రైలర్ , పాటలు , గ్లింప్స్ విడుదల చేయగా అనూహ్య స్పందన సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా జూన్ 4న ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

హై జవానీ తో ఇష్క్ హోనా హై : జూన్ 5

ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ , పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హై జవానీతో ఇష్క్ హోనా హై. ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సింగ్ గీతం: జూన్ 11

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న మ్యూజికల్ ఫాంటసీ మూవీ సింగ్ గీతం. ఈ సినిమా జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇందులో అయాన్, అహల్య బమ్రూ కీలక పాత్రలు పోషించారు.

భారత్ భాగ్య విధాత : జూన్ 12

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌథ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారత్ భాగ్య విధాత. జూన్ 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో నాలుగు వందల మంది ప్రాణాలను కాపాడిన హాస్పిటల్ సిబ్బంది కి సంబంధించిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనోజ్ తపాడియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మే వాపస్ ఆవుంగా : జూన్ 12

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో దిల్జిత్ దోసాంజ్, శార్వరి, వేదాంగ రైన కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాక్ టెయిల్ 2: జూన్ 19

2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కాక్ టెయిల్ కి సీక్వెల్ గా .. కాక్ టెయిల్ 2 రాబోతోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ , రష్మిక మందన్న కలయికలో హోమి ఆడజానియా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

మా ఇంటి బంగారం : జూన్ 19

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషిస్తూ వస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. మే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల జూన్ 19 కి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన చిత్రాలు, గ్లింప్స్, వీడియోలు అంచనాలు పెంచేసాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

లెనిన్: జూన్ 26

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా వస్తున్న చిత్రం లెనిన్. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

వీటితోపాటు మరికొన్ని చిత్రాలు జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News