ఎన్టీఆర్ నెల్సన్ ను రిజెక్ట్ చేయకుండా ఉంటే బాగుండేదా?

తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు.

Update: 2026-10-16 12:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న నటుడు ఎన్టీఆర్... ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో పెను సంచలనం క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. వైవిధభరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. 'దేవర' సినిమాతో పాన్ ఇండియాలో సోలో హీరోగా వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు...

నెల్సన్ డైరెక్షన్ లో చేసి ఉంటే బాగుండేదా...

తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. 'జైలర్' సినిమాతో రజనీకాంత్ కి అదిరిపోయే సక్సెస్ ని అందించిన ఆయనకి ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. మరలాంటి నెల్సన్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు కథ కూడా వినిపించాడు. ఎన్టీఆర్ కి స్టోరీ నచ్చింది కానీ నెల్సన్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి తెలుగులో మాత్రమే మంచి మార్కెట్ ఉంది. బాలీవుడ్ లో 'దేవర' సినిమాతో కొంతవరకు మెప్పించినప్పటికి 'వార్ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అతనికి ఏ రకంగానూ హెల్ప్ కాలేదు. కాబట్టి తమిళ్ తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడితే బాగుంటుంది...

అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత తమిళంలో తను ఇంకా పెద్ద స్థాయిలో మార్కెట్ ని ఏర్పరచుకోవడానికి అక్కడి స్టార్ డైరెక్టర్ అయిన అట్లీతో 'రాకా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ తమిళంలో తన సత్తా చాటుతుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తమిళ్ దర్శకులతో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తెలుగుతోపాటు తమిళ్ మార్కెట్ కూడా చాలా కీలక అని హీరోలందరూ భావిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

ఇప్పుడున్న స్టార్ హీరోలందరితో పోలిస్తే ఆయన తన మార్కెట్ ను మరింత పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది... రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మంచి కాంబినేషన్లను సెట్ చేసుకోవాలని ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్న దర్శకులతో సినిమాలు చేసినప్పుడు మాత్రమే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే పెద్ద ఎత్తున సినిమాకి ఓపినింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. నెల్సన్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'జైలర్ 2' మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది...

Tags:    

Similar News