'జైలర్ 2' లో ఆ సీన్స్ అవసరమా?

నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్ 2' మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది.

Update: 2026-10-16 10:43 GMT

నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్ 2' మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి... ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు బాలీవుడ్ అత్యుత్తమ నటి విద్య బాలన్ ఒక క్యారెక్టర్ లో నటించింది...

విద్యాబాలన్ చేత ఆ క్యారెక్టర్ ఏంటి?

కహాని, డర్టీ పిక్చర్ సినిమాలతో విమర్శకుల ప్రశంశలను అందుకున్న విద్యాబాలన్ చాలా గొప్ప నటి.. ఈ మూవీ లో ఆమె స్థాయికి తగ్గ పాత్రను తీర్చిదిద్దలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రౌడీ గ్యాంగ్ లో సభ్యురాలుగా చూపించడం ఏంటి? అంటూ నెల్సన్ మీద విమర్శలు చేస్తున్నారు...

సామాజిక స్పృహ ఉండాలి...

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. ప్రధాన పాత్రలు ఎంతో కొంత సామాజిక స్పృహ కలిగి ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ నెల్సన్ మాత్రం వాటిని పట్టించుకోకుండా కొన్ని సన్నివేశాలను రాసుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి. విద్యాబాలన్ పాత్ర పట్ల రజినీకాంత్ వ్యవహరించిన తీరు మహిళా వ్యతిరేక చర్యలని చూపించే విధంగా రాశారంటూ సినీ విమర్శకులు సైతం నెల్సన్ మీద విమర్శలు చేస్తున్నారు.... రజినీకాంత్ ఒక సన్నివేశంలో విద్యాబాలన్ ను చూస్తూ సూపర్ అంటాడు. రజినీకాంత్ ఉన్న ఏజ్ కి అలాంటి డైలాగ్స్ పెట్టడం అవసరమా? ఆయన మూవీ చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మూవీలో ఇలాంటి డైలాగ్స్ ఉండటం వల్ల ఆ పాత్ర తో ప్రేక్షకుడు పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

అలాగే రజినీకాంత్ ను అభిమానించే వాళ్ళు కూడా ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. డైరెక్టర్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సన్నివేశాలు రాసి ఉండచ్చు. కానీ అది రజినీకాంత్ లాంటి హీరో చెప్పడం కరెక్ట్ కాదని నెల్సన్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు... విద్యాబాలన్ ను తీసుకొని ఆమెకి ఇంపార్టెన్స్ ఉన్న మంచి పాత్ర ను ఇవ్వలేకపోయాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ 2 మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, రజినీకాంత్ ను మొదటి పార్ట్ లో చూపించినంత ఎఫెక్టివ్ గా చూపించలేదనే విమర్శలు వస్తున్నాయి... వీటన్నింటి మధ్యలో ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది. ఈ దసరా విన్నర్ గా నిలుస్తుందా లేదా చూడాలి...

Tags:    

Similar News