'కింగ్ 100' టైటిల్ వెన‌క అస‌లు ర‌హ‌స్యం?

అక్కినేని నాగార్జున 100వ చిత్రం `కింగ్ 100` శరవేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-10-16 10:30 GMT

అక్కినేని నాగార్జున 100వ చిత్రం `కింగ్ 100` శరవేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే నాగార్జున ఇలాంటి టైటిల్ నే ఎందుకు ఎంచుకున్నాడు? అంటూ చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది.

ఈ సినిమాకు `కింగ్ 100` అనే శీర్షిక ఎందుకు పెట్టారో వివరిస్తూ కథలోని ఒక కీలకమైన సన్నివేశంలో అసలు కారణాన్ని చూపించబోతున్నారని ఇన్‌సైడ్ వర్గాల సమాచారం. నాగార్జున సినీ కెరీర్‌లోనే ఈ ప్రత్యేక అంశం కథకు ప్రధాన బలంగా నిలవనుందని.. ఇది అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచుతుందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి టైటిల్ వెన‌క ర‌హ‌స్యం ఏమిటో తెలుసుకోవాల‌నుకునేవారికి ఇది స‌ర్ ప్రైజింగ్ గా ఉండ‌నుంద‌ని కూడా తెలుస్తోంది.

ఈ చిత్రం కథాంశం ఒక సామాన్యుడి అసాధారణ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి, అత్యంత సంపన్నుడిగా మారి `ది కింగ్` అనే బిరుదును పొందిన ఒక వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఆగస్టు 29న అన్నపూర్ణా స్టూడియోస్ విడుదల చేసిన టీజర్ గ్లింప్స్ ప్రేక్షక లోకాన్ని గొప్ప‌గా ఆకట్టుకుంది. కట్టల కొద్దీ నోట్లు, ఇటుకల్లా పేర్చిన బంగారు బిస్కట్లు, గుర్రపు పందెలు, శత్రువుల దండయాత్రల నడుమ రూ. 50,000 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూడటం.. దానితో తలెత్తే రాజకీయ ఉద్రిక్తతలు.. అల్లర్ల నేపథ్యం టీజర్‌లో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి.

ఈ విజువల్ గ్రాండియర్ వెనుక ఒక భావోద్వేగపూరితమైన ఉపకథ కూడా ఉంది. ఒకవైపు వేల కోట్ల స్కామ్- విధ్వంసం జరుగుతుండగా.. అదే గందరగోళంలో చిక్కుకున్న ఒక చిన్నపాటి పసిపాపను కాపాడాల్సిన కీలకమైన సన్నివేశం కథకు ప్రాణంగా నిలవనుంది. నాగార్జునతో పాటు టబు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ సినిమాలో నటించడం అభిమానులకు ప్ర‌త్యేకంగా మారింది. వీరితో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, అశోక్ సెల్వన్, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనుంది.

ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ నటించిన `కింగ్` సినిమాతో ఈ చిత్రం పోటీపడనుండటం విశేషం. దశాబ్దాల నాగార్జున సినీ ప్రయాణానికి చిహ్నంగా తెర‌కెక్కుతున్న ఈ 100వ చిత్రం అటు మాస్ యాక్షన్‌ను, ఇటు ఎమోషన్స్‌ను సమపాళ్ళలో అందిస్తూ వెండితెరపై కొత్త చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News