ఒకప్పుడు సౌత్ లో ఐరన్ లెగ్ ముద్ర.. విద్యాబాలన్ ఇప్పుడు చెరిపేసుకుంటుందా?
విద్యాబాలన్.. సినీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్న ఈమె హిందీ, బెంగాలీ చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.
విద్యాబాలన్.. సినీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్న ఈమె హిందీ, బెంగాలీ చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నటనా రంగ ప్రవేశంలో మ్యూజిక్ వీడియోలలో, సీరియల్స్ లో ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి విద్యాబాలన్ పదహారేళ్ల వయసులోనే ఏక్తాకపూర్ నిర్మించిన హమ్ పాంచ్ అనే హిందీ సీరియల్ లో నటించింది. అయితే ఈ సీరియల్ లో ఈమెకు మంచి ఆదరణ లభించడంతో.. హీరోయిన్ అవుతాననే తన కోరికను ఇంట్లో చెప్పిందట. కుటుంబ సభ్యులు మాత్రం చదువు పూర్తయ్యాకే ఇండస్ట్రీలోకి వెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులకు కోరిక మేరకు ముంబై యూనివర్సిటీ నుండి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకుంది విద్యాబాలన్.
అప్పటికీ నటనపై ఆసక్తి తగ్గకపోవడంతో.. మెల్లగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. అలా తొలిసారి మలయాళంలో మోహన్ లాల్ సరసన చక్రం అనే సినిమాకు సంతకం చేసింది. కానీ నిర్మాణంలో సమస్యలు తలెత్తడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో మలయాళం ఇండస్ట్రీలో ఈమెకు ఐరన్ లెగ్ అని పేరు పెట్టారు. చేసేదేమీ లేక తమిళం పై తన దృష్టి పెట్టింది. 2002లో రన్ అనే సినిమాలో ఈమెను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఈమెను తప్పించి, మీరాజాస్మిన్ తో రీప్లేస్ చేశారు. అలాగే మనసెల్లం అనే సినిమాలో కూడా ఈమెను తీసుకొని , ఆ తర్వాత త్రిష కృష్ణన్ తో రీప్లేస్ చేశారు.
ఇన్ని చాన్సులు కోల్పోయినా..ఆమె ప్రయత్నాలు మాత్రం ఆగిపోలేదు. మళ్లీ ఎన్నో తంటాలు పడి 2003లో కలారి విక్రమన్ అనే సినిమా పూర్తి చేసినా.. అది విడుదలకు నోచుకోలేదు. ఇలా కెరియర్ ప్రారంభంలోనే ఎన్నో కష్టాలు పడింది. సౌత్ లో నటించిన సినిమాలు ఏవి కూడా విడుదలకు నోచుకోలేదు. అలాగని సైన్ చేసిన చిత్రాలు ఈమె వరకు రాలేదు. దాంతో చేసేదేమీ లేక సౌత్ ఇండస్ట్రీని వదిలి 2005లో పరిణీత అని చిత్రంతో హిందీ రంగ ప్రవేశం చేసింది. అది పర్వాలేదు అనిపించుకోవడంతో సంజయ్ దత్ సరసన లగే రహో మున్నాభాయ్ అనే సినిమాలో జాహ్నవి పాత్రతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఆ తర్వాత భూల్ భులయ్య , ఇష్కియా, కిస్మత్ కనెక్షన్ , పా ఇలా పలు చిత్రాలు చేసిన ఈమె ది డర్టీ పిక్చర్ తో తిరుగులేని ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు తన నటనతో పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి విద్యాబాలన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రత్యేకించి సౌత్ లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకొని.. మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత సౌత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జైలర్ సినిమా సీక్వెల్ జైలర్ 2 లో కాంత అనే పవర్ఫుల్ పాత్ర పోషించింది . పైగా తమిళ చిత్ర సీమలోకి పూర్తిస్థాయిలో ఈ సినిమా ద్వారానే అడుగు పెట్టింది విద్యాబాలన్. ఈ సినిమాలో విలన్ చక్రి కల్పక్ (మిథున్ చక్రవర్తి) కూతురు కాంతా అనే నెగటివ్ షేడ్స్ ఉన్న శక్తివంతమైన పాత్రలో నటించింది.
2026 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విద్యాబాలన్ పాత్ర పై ప్రశంసలు కురుస్తున్నాయి. అద్భుతమైన నటనతో, గంభీరమైన స్క్రీన్ ప్రజెంట్స్ తో కాంత పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముత్తువేల్ ( రజినీకాంత్)! నెట్వర్క్ ను ఎదుర్కొనే సన్నివేశాలలో ఆమె నటన చాలా ఆసక్తికరంగా సాగింది. పైగా రజనీకాంత్ ముఖంపై సిగరెట్టు పొగ వదిలే సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే సంభాషణలు సినిమాకే హైలెట్గా నిలిచాయి. ఇకపోతే ఈమె తన ప్రతిభను చాటుకున్నప్పటికీ కొంతమంది మాత్రం ఈమెకు తగిన స్క్రీన్ స్పేస్ లభించలేదు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కానీ జైలర్ 3 కూడా ప్రకటించడంతో ఈ సినిమాలో ఆమె పాత్రే ప్రధాన విలన్ గా మారే అవకాశం ఉందని హింట్ ఇచ్చింది చిత్ర బృందం. మరి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సౌత్లో ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న ఈమె.. ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా మారి మళ్ళీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.