ఈ విషయంలో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా
ఆమె గర్భిణీ అంటూ కొన్నాళ్లుగా రూమర్లు వస్తున్నాయి. వాటిపై కెనీషా రెస్పాండ్ అయింది.;
కోలీవుడ్ నటుడు జయం రవి కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తికి తెలియకుండా విడాకులను ఇస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కిన ఆయన ఆ తర్వాత సింగర్ కెనీషాతో రిలేషన్ లో ఉన్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దపై ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవగా, తాజాగా కెనీషాకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు నెట్టింట ప్రచారమవుతుంది.
ఆమె గర్భిణీ అంటూ కొన్నాళ్లుగా రూమర్లు వస్తున్నాయి. వాటిపై కెనీషా రెస్పాండ్ అయింది. తానేం దేవ దూతను కాదని, అలాగని దెయ్యాన్ని కూడా కాదని, సోషల్ మీడియాలో తనపై ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయని, ఓ గాసిప్ మరో గాసిప్ కు దారి తీస్తోందని, అన్నింటికీ కాలమే పరిష్కారం చెప్తుందని వీటికి తాను కూడా సమాధానం చెప్పగలనని, కానీ ఈ విషయంలో తాను మాట్లాడకూడదని డిసైడ్ అయినట్టు చెప్పింది.
రీసెంట్ గా ఓ సాంగ్ షూటింగ్ టైమ్ లో కెనీషా ఫోటోను ఉద్దేశిస్తూ కొందరు ఈ రూమర్లు సృష్టించగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యాయి. గత కొన్నాళ్లుగా జయం రవితో పాటూ కెనీషా పేరు కూడా వినిపిస్తూనే ఉండగా, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెనీషా వల్లే జయం రవి, తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారని కూడా వార్తలొచ్చాయి.
ఆర్తికి విడాకులు ఇచ్చినప్పటి నుంచి జయం రవి, కెనీషాతోనే ఉంటున్నాడని, వారిద్దరూ డేటింగ్ లోనే ఉంటున్నారని వార్తలు రాగా, ఆ వార్తలను నిజం చేస్తూ మొన్నా మధ్య ఈ ఇద్దరూ కలిసి చెన్నైలో ఓ పెళ్లికి హాజరయ్యారు. ఎప్పుడైతే వీరిద్దరూ కలిసి పెళ్లికి హాజరయ్యారో ఈ జంట గురించి వార్తలు రావడం ఇంకా ఎక్కువయ్యాయి.