వార‌సుడు జాస‌న్ సంజ‌య్ డెబ్యూ.. CM విజ‌య్ లైట్ తీస్కున్నారా?

తన తల్లి సంగీత ఎప్పుడూ తన గురించి, తన సోదరి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ పెద్ద ఆసరాగా నిలుస్తారని తెలిపారు.

Update: 2026-10-02 09:15 GMT

దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా `సిగ్మా` ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల‌వ్వ‌డంతో అభిమానుల్లో బోలెడంత ఎగ్జ‌యిట్ మెంట్ నెల‌కొంది. సందీప్ కిషన్ - ఫరియా అబ్దుల్లా ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హిస్ట్ కామెడీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, థమన్ సంగీతం అందించారు. తన తండ్రి నీడ నుంచి పూర్తిగా దూరంగా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలనే ఉద్దేశంతో జాసన్ ఈ ప్రాజెక్ట్ తో ఒంట‌రిగా పోరాటం మొద‌లుపెట్టాడు.

ఈ సినిమా విడుదలకు ముందు.. పియర్లీ మానేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాసన్ తన తండ్రి విజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన.. సరదా విషయాలను షేర్ చేసుకున్నారు. విజయ్ సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉంటారని..ఏదైనా విషయంపై స్పందించడానికి కాస్త సమయం తీసుకుంటారని తెలిపారు. ఒకవేళ విజయ్ `సిగ్మా` సినిమా చూసి ఫోన్‌లో ఒక్క నిమిషం పాటు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే.. తనే స్వయంగా `నేను ఫోన్ పెట్టేయమంటారా, మీరు పూర్తిగా ఆలోచించుకున్నాక మళ్ళీ కాల్ చేయమంటారా?`` అని సరదాగా అడుగుతానని నవ్వుతూ చెప్పారు.

ఇంట్లో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందనే దానిపై కూడా జాసన్ మాట్లాడారు. తన తల్లి సంగీత ఎప్పుడూ తన గురించి, తన సోదరి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ పెద్ద ఆసరాగా నిలుస్తారని తెలిపారు. తండ్రి విజయ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పడం ద్వారా. అభిమానులకు ఎప్పుడూ కనిపించని విజయ్ కుటుంబ కోణాన్ని ఈ ఇంటర్వ్యూ చూపించింది. విజయ్ ప్రమోషన్స్ అన్నింటికి దూరంగా ఉంటూ.. తన కొడుకు సృష్టించిన సినిమాను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

త‌న మొదటి సినిమాకు వచ్చే ఏ ఫీడ్‌బ్యాక్ అయినా తన తండ్రి చివరకు తన పని చూసి గర్వపడతారని యువ‌కుడైన జాస‌న్ బలంగా నమ్ముతున్నారు. విజయ్‌‌ను `ఇళయదళపతి`గా ఆరాధించిన సుదీర్ఘకాలపు అభిమానులకు.. ఇప్పుడు ఆయన కుమారుడు దర్శకుడిగా తమిళ సినిమా రంగంలో అడుగుపెట్టడం ఒక అద్భుతమైన ఫుల్ సర్కిల్ మూవ్ మెంట్ అనుకోవ‌చ్చు. దళపతి అభిమానుల తరఫున జాసన్ సంజయ్‌కు ..`సిగ్మా` చిత్ర బృందానికి `తుపాకి` శుభాకాంక్షలు!

సాహ‌సాలు దొంగ‌త‌నాల నేప‌థ్యంలో...!

`సిగ్మా` చిత్రంలో సందీప్ కిషన్ - ఫరియా అబ్దుల్లా ప్రధాన తారాగణంగా నటించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ హిస్ట్ కామెడీ చిత్రంగా రూపొందింది. సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఇది ఉత్కంఠభరితమైన సాహసాలు, దొంగతనాల చుట్టూ తిరిగే వినోదాత్మక అంశాలతో కూడిన విభిన్నమైన కథాకథనంతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక జాసన్ సంజయ్ పరిణతి విషయానికి వస్తే.. తన తండ్రి స్టార్‌డమ్ నీడను ఉపయోగించుకోకుండా.. పూర్తిగా తన సొంత ప్రతిభతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తీరు అతడి పరిణతికి నిదర్శనం. సినిమా ప్రమోషన్స్‌కు విజయ్‌ను దూరంగా ఉంచుతూ.. తన మొదటి సినిమాకు ఒక స్వతంత్రమైన గుర్తింపును తీసుకురావాలని కోరుకోవడం అతడి ఆలోచనా విధానంలో ఉన్న మెచ్యూరిటీని, సినిమాపై ఉన్న నిజాయితీని తెలియజేస్తుంది.

Tags:    

Similar News