'పెద్ది' ఈవెంట్లో తెలుగు మాట‌లు క్యూట్‌గా.. ఫ్రెండ్స్ కోసం షేర్ చేసిన జాన్వీ!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో కన్నులపండువగా జరిగింది.

Update: 2026-06-02 11:35 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా స్టేజ్ పై ఈ ముంబై బ్యూటీ తెలుగులో మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన అభిమానులను , నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ తన ముద్దుముద్దు తెలుగు మాటలతో వేదికపై ఉన్న వారందరినీ అలరించడమే కాకుండా.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.

ఈ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ-``అందరికీ నమస్కారం. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. `పెద్ది` సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను`` అంటూ ఎంతో క్యూట్‌గా ప్రసంగాన్ని ప్రారంభించారు. మీ ప్రేమ, అభిమానమే మమ్మల్ని మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుందని... ఈ సినిమా తన జీవితంలో ఎంతో స్పెషల్ అని జాన్వీ చెప్పుకొచ్చారు. మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు అంటే ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలను `పెద్ది` చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించినట్లు జాన్వీ తెలిపారు.

తన ముద్దుముద్దు తెలుగు ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను జాన్వీ కపూర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ``తెలుగు మాటలు క్యూట్ గా...`` అంటూ తన సోషల్ మీడియా ఫాలోవర్స్ - స్నేహితుల కోసం ఈ ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే విపరీతంగా వైరల్ అయింది. జాన్వీ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ..త‌ను పలికిన తెలుగు పదాలకు బాలీవుడ్, టాలీవుడ్ స్నేహితులతో పాటు అభిమానులు సైతం లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన అద్భుతమైన నటుడే కాకుండా గొప్ప వ్యక్తి అని జాన్వీ కొనియాడారు. దర్శకుడు బుచ్చిబాబు అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్ అని, రెహమాన్ గారు ఒక లెజెండ్ అని ప్రశంసించారు.`పెద్ది` ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని, బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని చెబుతూ.. ఈసారి తనను వెండితెరపై ఇంకొంచెం ఎక్కువగా చూస్తారని జాన్వీ కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్యూట్ వీడియో చూసాక జాన్వీ బాలీవుడ్ ఫ్రెండ్స్ సారా అలీఖాన్, సుహానా ఖాన్, సాన‌యా క‌పూర్ లాంటి న‌ట‌వార‌సురాళ్లు క‌చ్ఛితంగా కుళ్లుకుంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జాన్వీక‌పూర్ రేంజులో ద‌క్షిణాది ఎంట్రీ ఇవ్వాల‌ని క‌ల‌లు గంటున్న వీళ్లంద‌రికీ ఆ అదృష్టం ద‌క్క‌లేద‌నే చెప్పాలి. అన‌న్య పాండే కు విజ‌య్ దేవ‌రకొండ స‌ర‌స‌న లైగ‌ర్ లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా కానీ, అదృష్టం క‌లిసి రాలేదు.




Tags:    

Similar News