జగపతి బాబు వల్ల బాలయ్యకిఎఫెక్ట్..!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో ఎక్కువమంది ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఆయన చేసిన 3 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి.;

Update: 2025-09-14 04:02 GMT

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో ఎక్కువమంది ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఆయన చేసిన 3 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య ఎంత సరదాగా ఉంటారన్నది అన్ స్టాపబుల్ తోనే తెలిసింది. ఐతే అన్ స్టాపబుల్ షో నెక్స్ట్ సీజన్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ ఉంటుందా లేదా అసలు అహా టీం ప్లాన్ చేస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి షాక్ ఇస్తూ రీసెంట్ గా జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా మొదలు పెట్టారు.

సెలబ్రిటీస్ ఎక్స్ క్లూజివ్ విషయాలు..

జీ 5లో ప్రసారం అవుతున్న ఈ స్పెషల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇప్పటికే 3 ఎపిసోడ్స్ దాకా పూర్తైన ఈ షోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జయమ్ము నిశ్చయమ్మురా షోలో జగపతి బాబు ఇంటర్వ్యూకి వచ్చిన సెలబ్రిటీస్ కి సంబందించిన ఎక్స్ క్లూజివ్ విషయాలు అది కేవలం వాళ్ల పర్సనల్ అనుకున్న వారికి మాత్రమే తెలిసినవి బయటకు చెబుతూ మాట్లాడుకుంటున్నారు.

జగపతి ఆబు షో వల్ల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి ఎఫెక్ట్ పడేలా ఉంది. హీరోగా సినిమా ఛాన్స్ లు లేని టైం లో విలన్ గా టర్న్ తీసుకున్న జగపతి బాబు అలా సౌత్ లో ప్రతినాయకుడిగా సూపర్ ఫాం కొనసాగించారు. ఇక తను ఇప్పుడు మళ్లీ హోస్ట్ గా మారి సర్ ప్రైజ్ చేస్తున్నాడు. జయమ్ము నిశ్చర్యమ్మురా షో ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది.

జయమ్ము నిశ్చయమ్మురా షోకి మంచి ఫాలోయింగ్..

ఐతే ఈ టాక్ షో మిగతా టాక్ షోలకు కూడా పోటీ ఇస్తుందా అంటే ఏమో ఇంకా కమింగ్ డేస్ లో తెలుస్తుంది. ప్రస్తుతానికి మరెక్కడ ఇలాంటి టాక్ షోస్ నడవట్లేదు కాబట్టి జగపతి బాబు షోకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ టాక్ షో కోసం జీ 5 జగపతి బాబుకి మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య సినిమాల్లో కాస్త జోరు తగ్గించిన జగపతి బాబు హోస్ట్ గా మారి సర్ ప్రైజ్ చేశారు.

జగపతి బాబు ఇది మాత్రమే చేస్తాడా అన్న దగ్గర నుంచి ఆయన ఏమైనా చేస్తాడు అన్న విధంగా మారాడు. జయమ్ము నిశ్చయమ్మురా షోతో ఆడియన్స్ కు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు జగపతి బాబు. తప్పకుండా ఈ షోకి ఆయన హోస్టింగ్ అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News