'జాట్' తెలుగు మార్కెట్ బజ్ వృధానేనా?
ఇంకా చాలా విధాలుగా జాట్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అందుకే తెలుగులోనూ భారీ ఎత్తున మైత్రి వారు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.;
సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'జాట్' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈనెల 10న 'జాట్' సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. గదర్ సినిమా తర్వాత సన్నీ డియోల్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో బాలీవుడ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందించాడని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా హిట్ అవుతున్న మాస్ జానర్‌లో ఈ సినిమా ఉండబోతుంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతో బాలీవుడ్‌లో సాలిడ్‌గా ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్‌కి చెందిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగు దర్శకుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన సంగీత దర్శకుడు తమన్ తో నిర్మించింది. అంతే కాకుండా ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హీరోయిన్ రెజీనా కసాండ్రా నటించింది. ఇంకా చాలా విధాలుగా జాట్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అందుకే తెలుగులోనూ భారీ ఎత్తున మైత్రి వారు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో సినిమా విడుదలపై అనుమానాలు ఉన్నాయి.
జాట్ హిందీ వర్షన్ విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ తెలుగు డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అంతే కాకుండా తెలుగు వెర్షన్ కోసం చేసిన కొన్ని ముఖ్య సన్నివేశాల వర్క్ పూర్తి కాలేదని టాక్ వినిపిస్తుంది. అందుకే ఇప్పటి వరకు తెలుగు వర్షన్‌కు సంబంధించిన ప్రమోషన్ వర్క్ జరగలేదని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి ఉన్న బలంతో జాట్ సినిమా డబ్బింగ్ వర్షన్ అయినప్పటికీ ఎక్కువ థియేటర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు జాట్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కనుక మినిమం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
గోపీచంద్ మలినేని గత చిత్రాల ఫలితంతో పాటు, మైత్రి మూవీ మేకర్స్ వారి ట్రాక్ రికార్డ్, తమన్ అభిమానులు ఇలా చాలా ఎలిమెంట్స్ కారణంగా జాట్‌ను తెలుగులో చూడాలి అనుకునే వారు చాలా మంది ఉన్నారు. జాట్‌కి తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది, అంతే కాకుండా మంచి మార్కెట్ ఉంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ తెలుగులో ఈనెల 10న విడుదల కాకుంటే కచ్చితంగా నష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జాట్‌కి క్రియేట్ అయిన అంత మార్కెట్ బజ్ వృధానే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి జాట్ హిట్ అయితే అప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.