• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 షూటింగ్.. ఇంకా...

పుష్ప 2 షూటింగ్.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది?

| అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ పైన చాలా ఎఫర్ట్ పెట్టారు.

By - Tupaki Desk
Update: 2024-07-16 04:12 GMT

టాలీవుడ్ లో సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ నిలవబోతోంది. మూడేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన పర్ఫాక్షన్ తో బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావడం కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ కారణంగానే సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది. అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ పైన చాలా ఎఫర్ట్ పెట్టారు.

ఈ సీక్వెల్ తో కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో మూవీ రిలీజ్ డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. దీంతో కావలసినంత టైం దొరకడం వలన షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ తీసుకొని షూటింగ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఓ వైపు సుకుమార్ చేస్తూనే మరో వైపు షూటింగ్ కూడా పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.

తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్స్ కి వెళ్లి తిరిగి ఇండియా వచ్చారు. దీంతో మళ్ళీ కొద్ది రోజులు షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఇంకా ఈ మూవీ 35 రోజుల షూటింగ్ షెడ్యూల్ పెండింగ్ ఉందంట. ప్రస్తుతానికి అయితే షూటింగ్ బ్రేక్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. సుకుమార్ అయితే ప్రాణం పెట్టి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. అస్సలు విరామం కూడా తీసుకోవడం లేదంట.

దర్శకుడిగా నెక్స్ట్ లెవల్ కి పుష్ప ది రూల్ మూవీతో సుకుమార్ వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే డెడికేషన్ తో వర్క్ చేస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా పుష్పలో ఉన్న ఊ అంటావా తరహాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందంట. అయితే ఆ సాంగ్ లో డాన్స్ చేయడం కోసం ఐటెం గర్ల్ ఎంపిక ఇంకా జరగలేదని తెలుస్తోంది. జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే రెమ్యునరేషన్ దగ్గర హోల్డ్ అయ్యింది.

అంతకంటే తక్కువ రెమ్యునరేషన్ లో బెస్ట్ ఛాయస్ ఇవరైనా ఉన్నారా అని సుకుమార్ టీమ్ చూస్తున్నారంట. అలాగే కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కూడా తెరకెక్కించాల్సి ఉందనే మాట వినిపిస్తోంది. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ లో పుష్ప ది రూల్ సినిమాకి ఎక్కువ డిమాండ్ ఉంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Pushpa 
  • Pushpa2 
  • AlluArjun 
  • Rashmikamandanna 
  • Sunil 
  • Sukumar 
  • PushpaShooting 
  • ItemSong 
  • Janhvikapoor 
  • Samantha 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS