• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంచలనం : బన్నీ వీడియో...

సంచలనం : బన్నీ వీడియో షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌

| బన్నీ దిన చర్య కు సంబంధించి మరియు షూటింగ్ కు హాజరు అయ్యే విజువల్స్ ను ఈ వీడియోలో చూపించడం జరిగింది.

By - Tupaki Desk
Update: 2023-08-30 04:48 GMT

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ లో ప్రతి రోజు లక్షల వీడియోలు కోట్లాది ఫోటోలు షేర్ అవుతూ ఉంటాయి. అయితే 654 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అఫిషియల్ అకౌంట్ లో మాత్రం చాలా రేర్ గా మాత్రమే ఫోటోలు మరియు వీడియోలు షేర్‌ అవుతూ ఉంటాయి. అత్యంత కీలకమైన వీడియోలు మరియు ఫోటోలను మాత్రమే ఆ అకౌంట్ లో షేర్ చేయడం జరుగుతుంది.

అంతర్జాతీయ సెలబ్రెటీల వీడియోలను అంతర్జాతీయ స్థాయి విషయాలను మాత్రమే షేర్‌ చేసే ఇన్‌స్టాగ్రామ్‌ అఫిషియల్‌ అకౌంట్‌ లో అల్లు అర్జున్‌ వీడియోను షేర్‌ చేయడం జరిగింది. బన్నీ దిన చర్య కు సంబంధించి మరియు షూటింగ్ కు హాజరు అయ్యే విజువల్స్ ను ఈ వీడియోలో చూపించడం జరిగింది.

బన్నీ వాయిస్ ఓవర్‌ తో పాటు సుకుమార్ కూడా మాట్లాడిన బైట్‌ ను ఈ వీడియో లో చర్చరడం జరిగింది. బన్నీ తన వర్క్ తో పాటు కుటుంబం ను ఎలా బ్యాలన్స్ చేస్తారు అనే విషయాన్ని కూడా ఈ వీడియో లో చూపించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో పుష్ప 2 సినిమా షూటింగ్ కు హాజరు అవ్వడంతో పాటు, అక్కడ షాట్ చిత్రీకరణ మొత్తాన్ని కూడా ఈ వీడియో లో చూపించారు.

జాతీయ అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కి ఇది ఇన్ స్టాగ్రామ్‌ నుండి స్పెషల్‌ సర్‌ప్రైజ్ అనడంలో సందేహం లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో బన్నీ వీడియో కు తెగ వ్యూస్ తో పాటు లైక్స్ షేర్స్ దక్కుతున్నాయి. ఇన్‌స్టా అఫిషియల్ అకౌంట్ లో ఈ వీడియో షేర్‌ అవ్వడం నిజంగా అరుదైన గౌరవం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో చిత్రీకరణ జరుపుతున్నారు. భారీ అంచనాల నడుమ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా కంటిన్యూ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంతో మరోసారి సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
  • Alluarjun 
  • Iconstar 
  • Nationalaward 
  • Pushpa2 
  • Socialmedia 
  • Instagram 
  • Ramojifilmcity 
  • Alluarjunfans 
  • Movieshooting 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS