• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్ర‌గ్స్...

డ్ర‌గ్స్ తీసుకుంటున్నాన‌ని అనుమానించారు: ఇమ్రాన్ ఖాన్

| స‌న్న‌ని శరీరం కారణంగా తాను డ్రగ్స్ వాడుతున్నాన‌ని మీడియా ఊహించింద‌ని వెల్ల‌డించాడు. నటనకు స్వస్తి చెప్పిన తర్వాత ఒక ఘ‌ట‌న‌.

By - Tupaki Desk
Update: 2023-10-06 13:30 GMT

2010ల ప్రారంభంలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఇమ్రాన్ ఖాన్ ఒకరు. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేన‌ల్లుడిగా అత‌డికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాక్లెట్ బోయ్ ఇమేజ్ తో అత‌డు క‌ల‌ల రాకుమారుడిగా ఏలాడు. అయితే కాల‌క్ర‌మంలో ప‌రిస్థితులు మారిపోయాయి. వ్య‌క్తిగ‌త జీవితంలో ఫ్యామిలీ లైఫ్ లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు ఇమ్ర‌న్. అతడు చాలా కాలంగా నటనకు స్వస్తి చెప్పి పరిశ్రమకు దూరమయ్యాడు. అప్పటి నుండి అభిమానులు అత‌డిని తిరిగి రావాలని అడుగుతున్నారు. ఇటీవల ఇమ్ర‌న్ త‌న‌ శరీర సమస్యల గురించి బ‌హిర్గ‌తం చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అతడు బ‌క్క ప‌లుచ‌ని శరీరం కారణంగా డ్రగ్స్ వాడుతున్నాడని మీడియా ఊహించిందని తెలిపాడు.

ఇమ్రాన్ ఖాన్ బాడీ ఇమేజ్ స‌మ‌స్య‌ల‌తో ఎలా కష్టపడ్డాడో తన ఇన్‌స్టాగ్రామ్ లో రాసాడు. తాను ఎప్పుడూ సన్నగా ఉన్నాన‌ని, జానే తు యా జానే నా చేస్తున్నప్పుడు రెండు పొరల దుస్తులు ధరించాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. తర్వాత కొన్ని సంవత్సరాలలో నా శరీరాకృతి మారింది. లుక్ నిర్వహణ నా జీవనశైలిలో భాగమైంది. నేను క్రమం తప్పకుండా జిమ్ యోగా చేసాను. కానీ ఇప్పటికీ నాకు గుర్తుంది. షూటింగ్ ప్రారంభించే ముందు మీరు కొంచెం ఎక్కువ పెరుగుతారు, సరియైనదా? అని లేదా నువ్వు బలహీనంగా కనిపిస్తున్నావు అని .. చిన్న పిల్లవాడిలా కనిపిస్తున్నావు.. మనిషిలా కాదు అని కూడా కామెంట్లు చేసిన‌వారున్నారు. హీరోయిన్ నీకంటే పెద్దగా కనిపిస్తోంద‌ని అన్న వాళ్లు లేక‌పోలేదు.

స‌న్న‌ని శరీరం కారణంగా తాను డ్రగ్స్ వాడుతున్నాన‌ని మీడియా ఊహించింద‌ని వెల్ల‌డించాడు. నటనకు స్వస్తి చెప్పిన తర్వాత ఒక ఘ‌ట‌న‌. నా ఫోటోషూట్ చేసిన మీడియా వ‌ల్ల చ‌ర్చ సాగింది. మాదకద్రవ్యాలు తీసుకుంటాన‌ని అందుకే ఇలా ఉన్నాన‌ని ఊహాగానాలు చేసారు! న‌న్ను ఎవ‌రైనా అలా చూడటాన్ని భ‌రించ‌లేక‌పోయాను. చాలా సిగ్గుపడ్డాను.. ఇబ్బంది పడ్డాను.. మరింత వెనక్కి తగ్గాను! అని తెలిపారు.

ఇటీవ‌ల‌ తన శరీరం గురించి జిమ్ లో శ్ర‌మిస్తాన‌ని, వాల్‌నట్ - పసుపు వంటి సహజ పదార్ధాలను మాత్రమే తీసుకుంటాన‌ని తెలిపాడు. కండలు తిరిగిన శరీరాకృతి కలిగిన కుర్రాళ్లను చూసి కాస్త అసూయపడేవాడిన‌ని తన గురించి తాను బాధపడనని ఇమ్రాన్ చెప్పాడు. జానే తు యా జానే నా దర్శకుడు అబ్బాస్ టైరేవాలాతో ఇమ్రాన్ ఖాన్ తిరిగి కంబ్యాక్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Tags:    
  • Bollywood 
  • Imrankhan 
  • Socialmedia 
  • Bodyimage 
  • Struggles 
  • Drugs 
  • Actor 
  • Photoshoot 
  • Media 

Similar News

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

Copyright @2026

Powered by Blink CMS