ఎన్ని అంచనాలు ఉన్నా.. అదే మెయిన్ కదా..

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రిలీజ్‌ కు ముందే హిట్, బ్లాక్‌ బస్టర్ అనే ట్యాగ్ లు వినిపించడం చాలా కామన్ అయిపోయింది.

Update: 2026-05-21 19:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రిలీజ్‌ కు ముందే హిట్, బ్లాక్‌ బస్టర్ అనే ట్యాగ్ లు వినిపించడం చాలా కామన్ అయిపోయింది. ఒక గ్లింప్స్ రిలీజ్ అయినా, ఒక పోస్టర్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే అంచనాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత ప్రతి పెద్ద సినిమాపై చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలు అయితే రిలీజ్‌ కు నెలల ముందే ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు, ట్రేడ్ పండితులు, సోషల్ మీడియా పేజీలు ఇలా అందరూ ముందుగానే ఫలితాలను ఊహిస్తూ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఎంత హైప్ ఉన్నా.. చివరకు సినిమాను నిలబెట్టేది మాత్రం కంటెంట్ మాత్రమే అన్న విషయం మళ్లీ మళ్లీ రుజువవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు సౌత్ నుంచి వస్తున్న పలు భారీ సినిమాలపై సోషల్ మీడియాలో భారీ ప్రిడిక్షన్స్ కనిపిస్తున్నాయి. వెల్కమ్ టు ది జంగిల్ వంటి పలు సినిమాలకు సూపర్ హిట్ బజ్ వినిపిస్తోంది. అదే సమయంలో పెద్ది హిందీ వెర్షన్‌ పై కూడా భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ కావడం, గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా తెరకెక్కుతుండటం వల్ల నార్త్ మార్కెట్‌ లో కూడా మంచి బజ్ ఏర్పడింది.

అలాగే టాక్సిక్ సినిమాపై కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అంచనాలు మరో లెవెల్‌ లో ఉన్నాయి. ఇక లాహోర్ 1947 సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంది. అలాగే రామాయణ సినిమాను ఇప్పటికే చాలామంది బ్లాక్‌ బస్టర్ రేంజ్ ప్రాజెక్ట్‌ గా చూస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, విజువల్ గ్రాండియర్ కారణంగా ఆ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు కింగ్ సినిమాపై కూడా భారీ స్థాయిలో ట్రేడ్ అంచనాలు వినిపిస్తున్నాయి. డాక్టర్ డూమ్, హైవాన్, మాతృభూమి వంటి సినిమాలపై కూడా సోషల్ మీడియాలో హిట్ ప్రిడిక్షన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్, టీజర్, కాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్స్, దర్శకుల క్రేజ్ ఆధారంగా అభిమానులు ముందుగానే ఫలితాలను అంచనా వేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాగే భారీ హైప్‌ తో వచ్చిన ఎన్నో సినిమాలు చివరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో కూడా చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరో ఇమేజ్‌ తో సినిమాలు సేఫ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కథలో కొత్తదనం, ఎమోషన్, స్క్రీన్‌ ప్లే, మేకింగ్ క్వాలిటీ అన్నీ చూస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల సినిమా బాగోలేకపోతే నెగటివ్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. రెండో రోజు నుంచే కలెక్షన్స్ పడిపోతున్న ఉదాహరణలు చాలానే కనిపిస్తున్నాయి.

మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం కంటెంట్ తో సంచలన విజయాలు సాధించాయి. మంచి కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్, ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ భారీ సినిమాల ప్రిడిక్షన్స్ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నా.. అసలైన రిజల్ట్ మాత్రం సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

Tags:    

Similar News