వీర‌మ‌ల్లు డిస్ట్రిబ్యూష‌న్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.;

Update: 2025-05-27 06:17 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. క‌రోనాకు ముందు మొద‌లైన ఈ సినిమా మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో యానిమ‌ల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగ‌జేబు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

ముందుగా ఈ సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ మొద‌లుపెట్టాడు. కానీ త‌ర్వాత సినిమా షూటింగ్ లేట‌వ‌డంతో డైరెక్ట‌ర్ క్రిష్ ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో నిర్మాత ఏఎం ర‌త్నం కొడుకు జ్యోతికృష్ణ సినిమా బాధ్య‌త‌ల్ని తీసుకుని సినిమాను పూర్తి చేశాడు. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో మేక‌ర్స్ ఈ సినిమా రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

రిలీజ్ ద‌గ్గర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ఈ సినిమా బిజినెస్ ను క్లోజ్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా డిస్ట్రిబ్యూష‌న్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును కేర‌ళ‌లో ప్ర‌ముఖ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ త‌న డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దుల్క‌ర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండ‌టంతో కేర‌ళ‌లో ఈ సినిమాకు మంచి బ‌జ్ వ‌చ్చే ఛాన్సుంది.

మ‌రోవైపు వీర‌మల్లు నైజాం మార్కెట్ కు సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సితార సంస్థ రేస్ లో ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూష‌న్ రేస్ లోకి మైత్రీ డిస్ట్రిబ్యూష‌న్ వారు కూడా వ‌చ్చార‌ని తెలుస్తోంది. దీంతో వీర‌మ‌ల్లు నైజాం హ‌క్కులు ఎవ‌రికి సొంతం అవుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమాకు గ్రాండ్ గా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌నున్నారు.

Tags:    

Similar News