వీరమల్లు మాస్ బ్యాటింగ్..!

ఐతే హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమా నుంచి ఇప్పటికే అన్ని సాంగ్స్ వదిలారు.;

Update: 2025-07-09 16:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఏ.ఎం రత్నం నిర్మించిన ఈ సినిమాను డైరెక్షన్ క్రిష్ మొదలు పెట్టాడు. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ బయటకు వెళ్లడంతో ఏ.ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రిలీజైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫిక్స్ అయ్యారు.

 

ఐతే హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమా నుంచి ఇప్పటికే అన్ని సాంగ్స్ వదిలారు. వీరమల్లు సాంగ్స్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఐతే స్టార్ సినిమాల ఓ.ఎస్.టి అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ తర్వాత వదులుతారు. కానీ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందే ఓ.ఎస్.టి లను రిలీజ్ చేస్తున్నారు.

కీరవాణి మ్యూజిక్ తో వస్తున్న వీరమల్లు మ్యూజిక్ పరంగా కూడా వేరే లెవెల్ అనిపించేలా ఉంది. పవర్ స్టార్ కి పర్ఫెక్ట్ ఎలివేషన్స్ పడటం వల్ల సాంగ్స్, బిజిఎం కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వీరమల్లు ఒక స్పెషల్ ఐ ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ట్రైలర్ ముందు వరకు సినిమాపై ఎలాంటి బజ్ లేదు ఎప్పుడైతే ట్రైలర్ రిలీజైందో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంతేకాదు ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. పవన్ ఇమేజ్ మీద ఆయన బాక్సాఫీస్ స్టామినా మీద నమ్మకం ఉన్న నిర్మాత ఏ.ఎం రత్నం వీరమల్లుతో పవర్ స్టార్ కి ఒక సూపర్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.

సినిమా షూటింగ్ లేట్ అవ్వడమే కాదు రిలీజ్ విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ గురి తప్పింది. కానీ ప్రాజెక్ట్ పై తమకున్న నమ్మకం తో పాటు సినిమా విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమని ప్రమోషనల్ కంటెంట్ తో రుచి చూపించారు. ముఖ్యంగా ట్రైలర్ తర్వాతనే వీరమల్లు మాస్ బ్యాటింగ్ మొదలైంది. తప్పకుండా ఈ ఓ.ఎస్.టి కూడా ఫ్యాన్స్ ని సంగీత ప్రియులను అలరిస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News